Akkineni Nagarjuna: నాన్న పర్స్ లో డబ్బులు దొంగతనం చేశా
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:15 PM
అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) నట వారసుడిగా విక్రమ్(Vikram) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna).
Akkineni Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) నట వారసుడిగా విక్రమ్(Vikram) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna). అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన చేయని ప్రయోగం లేదు. యువసామ్రాట్ నుంచి కింగ్ వరకు నాగ్ ఎదిగాడు. ప్రస్తుతం నాగార్జున నటిస్తున్నచిత్రాల్లో కుబేర(Kuberaa) ఒకటి. కోలీవుడ్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కినకుబేర చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
గతరాత్రి కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు డైరెక్టర్ రాజమౌళి గెస్ట్ గా విచ్చేసి మొదటి టికెట్ ను కొనుగోలు చేశాడు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ అడిగిన ఫన్నీ ప్రశ్నలకు నాగ్ తనదైన రీతిలో సమాధానాలు చెప్పుకొచ్చాడు. మనీ సంపాదించడానికి మనిషికి ఉండకూడని మూడు లక్షణాలు ఏంటి అన్న ప్రశ్నకు ఆశ, బద్ధకం ఉండకూడదని తెలిపాడు. ఇక ఈ జనరేషన్ కు ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇవ్వాలంటే ఏం ఇస్తారు .. ? ఫోన్ రీఛార్జ్ లకే యువత డబ్బులు ఖర్చుపెడుతుంది. ఒక మంచి నటుడిగానే కాకుండా ఒక వ్యాపారవేత్తగా ఆన్సర్ చెప్పండి అన్న ప్రశ్నకు.. ఫోన్ చూడకుండా ఉండమని సలహా ఇచ్చాడు.
Director Maruthi: డార్లింగ్.. ఇద్దరు హీరోయిన్లను పెట్టవా అని అడిగాడు
ఇక చివరగా అక్కినేని నాగేశ్వరరావు పర్స్ లో నుంచి ఎప్పుడైనా డబ్బులు దొంగతనం చేశారా అన్న ప్రశ్నకు చేశాను అని చెప్పుకొచ్చాడు. మరి మీ పర్స్ లో నుంచి అఖిల్ కానీ, చైతన్య కానీ దొంగతనం చేశారా అని అడిగితే .. అసలు నా పర్స్ లో డబ్బులు ఉండవు. అందుకే చేయలేదు అని ఆన్సర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కుబేర కాకుండా నాగార్జున కోలీవుడ్ లో కూలీ మూవీ చేస్తున్నాడు. రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కూడా నాగ్.. సపోర్టివ్ రోల్ లోనే నటిస్తున్నాడు. ఈ రెండు కాకుండా రా కార్తీక్ అనే డైరెక్టర్ తో నాగ్ తన 100 వ చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. మరి ఈ సినిమాలతో కింగ్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.