Akkineni Nagarjuna: ఆరోగ్యం బాలేనప్పుడు తప్ప 45 ఏళ్లుగా దాన్ని మిస్ అవ్వలేదు

ABN , Publish Date - Dec 30 , 2025 | 07:51 PM

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) 60 ఏళ్లు దాటినా ఆయన ఇంత ఫిట్ గా.. యంగ్ గా ఉండడానికి కారణం ఏంటి.. ? ఈ సీక్రెట్ గురించి తెలుసుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు.

Akkineni Nagarjuna

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) 60 ఏళ్లు దాటినా ఆయన ఇంత ఫిట్ గా.. యంగ్ గా ఉండడానికి కారణం ఏంటి.. ? ఈ సీక్రెట్ గురించి తెలుసుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. ఎట్టకేలకు నాగ్ నోటి నుంచే తాన్ ఫిట్ నెస్ సీక్రెట్ బయటపడింది. ఎన్నో ఇంటర్వ్యూలలో నాగ్ తన ఫిట్ నెస్ రహస్యం కేవలం టైమ్ కి తినడమే అని చెప్పుకొచ్చాడు. తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నాగార్జున తన ఆరోగ్య రహస్యం గురించి చెప్పుకొచ్చాడు.

' నేను టైమ్ కి తింటాను. కడుపు మాడ్చుకొని డైట్ చేయను.. అన్ని తింటాను. కానీ, సమయానికి తింటాను. ప్రతిరోజు జిమ్ కచ్చితంగా చేస్తాను. 45 ఏళ్లుగా నేను ఒక్కరోజు కూడా జిమ్ మిస్ అవ్వలేదు. ఆరోగ్యం బాలేనప్పుడు తప్ప మిగతా అన్నిరోజులు వ్యాయామం చేస్తాను. అదే ఫిట్ నెస్ కి సీక్రెట్. ఇక నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోను. అన్ని విషయాలను పాజిటివ్ గా తీసుకుంటాను. ఎలాంటి సమస్య ఎదురైనా నిరుత్సాహపడను.

ఇక ఈ ఏడాది నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇద్దరు కొడుకులకు పెళ్లి చేశాను. చాలా సంతోషంగా ఉన్నాను. వాళ్ళను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాగార్జున వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Dec 30 , 2025 | 08:24 PM