Akkineni Sobhita: తల్లి కాబోతున్న శోభిత.. నాగార్జున ఏమన్నాడంటే..?
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:57 PM
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) త్వరలో తాత కాబోతున్నాడా.. ? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి.
Akkineni Sobhita: అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) త్వరలో తాత కాబోతున్నాడా.. ? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. స్టార్స్ పెళ్లి చేసుకోనంతవరకు.. వారి పెళ్లిళ్లు ఎప్పుడు.. ఎవరితో అనేవి రూమర్స్ గా వస్తాయి. ఒక్కసారి పెళ్లి అయిపోతే పిల్లలు ఎప్పుడు.. అనే ప్రశ్నలు ఎదురవుతాయి. ఇక అక్కినేని నాగార్జున.. గత ఏడాదిలోనే తన ఇద్దరు వారసులను ఒక ఇంటివారిని చేసిన విషయం తెల్సిందే. పెద్ద కొడుకు నాగ చైతన్య (Naga Chaitanya).. హీరోయిన్ సమంత (Samantha)తో విడాకులు తీసుకున్నాక మరో నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అన్న పెళ్లి అయిన ఏడాదిలోపే అఖిల్ (Akhil Akkineni) కూడా.. తాను ప్రేమించిన జైనబ్ కు మూడు ముళ్ళు వేశాడు.
ఇక ఇద్దరు కుమారుల పెళ్లి తరువాత నాగార్జున చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే గత కొన్నిరోజుల నుంచి అక్కినేని పెద్ద కోడలు శోభితా తల్లి కాబోతుందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ, ఎప్పటికప్పుడు వాటిని శోభితా ఖండిస్తూనే వస్తుంది. నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తూ ప్లాట్ బెల్లీని చూపించి.. తాను ప్రెగ్నెంట్ కాదు అని నిరూపిస్తుంది. ఇక ప్రస్తుతం శోభితా.. తన సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ మధ్యన మరోసారి ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంకోపక్క శోభిత కాదు.. జైనబ్ ప్రెగ్నెంట్ అంటూ చెప్పుకొస్తున్నారు.
అఖిల్ - జైనబ్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఏఎన్నార్ మళ్లీ వస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై అక్కినేని నాగార్జున స్పందించాడు. హెల్త్ కి సంబంధించిన ఒక ఈవెంట్ లో పాల్గొన్న నాగ్ ని ఒక యాంకర్.. 'త్వరలోనే మీరు తాత కాబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. నిజమేనా' అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నను అర్ధం చేసుకోవడానికే నాగ్ కి టైమ్ పట్టింది. ఇక ప్రశ్న అర్ధం అయ్యాక కొద్దిగా నవ్వి.. 'ఇలాంటి శుభవార్తలు ఏవైనా ఉంటే.. నేనే స్వయంగా ప్రకటిస్తాను' అని చెప్పుకొచ్చాడు. దీంతో ఇవన్నీ రూమర్స్ అన్ని.. అక్కినేని కోడళ్లు ఇద్దరూ ప్రెగ్నెంట్ కాదని క్లారిటీ వచ్చింది. మరి అక్కినేని బ్రదర్స్ ఇప్పుడు కాకపోయినా కొత్త ఏడాదిలోనైనా శుభవార్త చెప్తారేమో చూడాలి.