Akkineni Naga Chaitanya: శోభితాతో పెళ్లి తరువాత సమంతను కలిసిన నాగచైతన్య

ABN , Publish Date - Dec 21 , 2025 | 09:58 PM

ఇదేందయ్యా ఇది.. ఇటు అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya).. శోభితా (Sobhita)ను పెళ్లి చేసుకున్నాడు. అటు సమంత (Samantha).. రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుంది.

Akkineni Naga Chaitanya

Akkineni Naga Chaitanya: ఇదేందయ్యా ఇది.. ఇటు అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya).. శోభితా (Sobhita)ను పెళ్లి చేసుకున్నాడు. అటు సమంత (Samantha).. రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుంది. ఎవరి జీవితాలు వారివి అయినప్పుడు మళ్లీ చై - సామ్ ఎందుకు కలిశారు అని కంగారుపడకండి. అక్కినేని నాగచైతన్య.. సమంతను కలిసిన మాట వాస్తవమే. కానీ, ఆ సమంత శోభితా చెల్లి. అంటే చై మరదలు అన్నమాట. శోభితా చెల్లి పేరు కూడా సమంతానే. అందుకే చై.. సామ్ ని కలిశాడు అంటే.. అందరూ మాజీ భార్య సమంత అని అనుకుంటున్నారు.

అక్కినేని నాగ చైతన్య- శోభితా నేడు సమంత ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. చెల్లి ఇంట్లో శోభితా చాలా బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. సమంత తన ఇన్స్టాగ్రామ్ లో అక్కాబావలతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసుకుంది. ఆ ఫోటోతో పాటు ఫుడ్, కాఫీ ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సమంత పెళ్లి తరువాత శోభితా పెళ్లి చేసుకుంది. చెల్లి పెళ్లి అన్ని తానే అయ్యి జరిపించింది శోభితా. ఆ సమయానికే ఆమె చైతో రిలేషన్ లో ఉంది. ఇక ఇప్పుడు చై.. తన అల్లుడు హోదాలో తన అత్తవారింటివారిని కలుస్తున్నాడు. ఈ ఫోటో చూసిన అభిమానులు అక్కాచెల్లెలి మధ్యలో అక్కినేని అందగాడు అదిరిపోయాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక చై సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వృషకర్మ సినిమాతో బిజీగా ఉన్నాడు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మరి ఈ సినిమాతో చై ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Dec 21 , 2025 | 09:59 PM