Akira Nandan: పవన్ వారసుడు.. ఏమున్నాడ్రా బాబు
ABN , Publish Date - Nov 30 , 2025 | 02:54 PM
అభిమానులు.. ఎప్పటినుంచో నట వారసుల ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. అందరి కన్నా ఎక్కువగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనయుడు అకీరా నందన్ (Akira Nandan) ఎప్పుడెప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
Akira Nandan: అభిమానులు.. ఎప్పటినుంచో నట వారసుల ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. అందరి కన్నా ఎక్కువగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనయుడు అకీరా నందన్ (Akira Nandan) ఎప్పుడెప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్ రాజకీయాలతో బిజీగా మారాడు. సినిమాలు అడపాదడపా మాత్రమే చేస్తున్నాడు. ఇంకా పని ఒత్తిడి ఎక్కువ అయితే సినిమాలు మానేసే అవకాశం కూడా ఉంది. దీంతో పవన్ ఫ్యాన్స్.. ఆయన సినిమాలు చేసేటప్పుడే అకీరాను లాంచ్ చేస్తే తండ్రి స్థానంలో కొడుకును చూసి ఆనందిస్తామని చెప్పుకొస్తున్నారు.
ఇక అకీరా ఏమి హీరో మెటీరియల్ లా లేడు అంటే ఓకే. కానీ, ఈ కుర్రాడు ఆరడుగుల బులెట్ అన్న పదానికి పర్ఫెక్ట్ అన్నట్లు ఉన్నాడు. అందంలో అయితే తండ్రి పవన్ కూడా సరిపోడు అని చెప్పొచ్చు. అందానికి అందం, అభినయం పండించేంత సత్తా ఉంది.. ఇంకా టాలీవుడ్ ఎంట్రీకి ఇంకేం కావాలి అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడు పవన్ పక్కన అకీరా కనిపించినా కూడా సోషల్ మీడియా మొత్తం అతడి నామస్మరణతోనే నిండిపోతుంది.
తాజాగా అకీరా.. తండ్రి పవన్ తో కలిసి సర్గమ్- ఇండియన్ నావల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా కార్యక్రమంలో పాల్గొన్నాడు. పవన్ ఎప్పటిలానే వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కనిపించగా.. అందరి కళ్లు వారసుడు అకీరా మీదనే పడ్డాయి. బ్లాక్ టీ షర్ట్ - గ్రే కలర్ ప్యాంట్ ధరించి చేతులు కట్టుకొని తండ్రి పక్కన నిలబడిన అకీరా లుక్ అద్భుతమని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ ముఖంలో తేజస్సు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇక అకీరాకు హీరో అయ్యే వయస్సు వచ్చిందని, మొదటిసారి పవన్ ని కాకుండా అకీరాను చూస్తున్నట్లు అభిమానులు చెప్పుకొస్తున్నారు. పవన్ వారసుడు.. ఏమున్నాడ్రా బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి పవన్.. అకీరా ఎంట్రీ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తాడో చూడాలి.