Akkineni Akhil: అయ్యగారు.. అలాంటి రిస్కులు ఇప్పుడు అవసరమా
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:08 PM
అక్కినేని వారసుడు అఖిల్ (Akhil).. ఏజెంట్ లాంటి భారీ డిజాస్టర్ నుంచి కోలుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే కొంత గ్యాప్ తీసుకొని లెనిన్ సినిమాను పట్టాలెక్కించాడు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం
Akkineni Akhil: అక్కినేని వారసుడు అఖిల్ (Akhil).. ఏజెంట్ లాంటి భారీ డిజాస్టర్ నుంచి కోలుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే కొంత గ్యాప్ తీసుకొని లెనిన్ సినిమాను పట్టాలెక్కించాడు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. మొదట ఈ చిత్రంలో అఖిల్ సరసన శ్రీలీల నటిస్తుందని ప్రకటించారు. ఆ తరువాత ఆమె తప్పుకోవడంతో ఆ ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్సేని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ, ఇది అంతకంతా ఆలస్యం అవుతూనే వస్తుంది.
తాజాగా లెనిన్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో అఖిల్ అంధుడిగా కనిపించనున్నాడట. తెలుగులో అంధుడిగా చాలా తక్కువ మంది హీరోలు నటించి మెప్పించారు. ముఖ్యంగా రాజా ది గ్రేట్ లో రవితేజ.. చూపులేనివాడిగా నటించి మంచి సక్సెస్ ని అందుకున్నాడు. అయితే అది కామెడీతో కూడుకున్న సినిమా కాబట్టి అంత ఇంపాక్ట్ చూపించలేదు. కానీ, లెనిన్ లో అఖిల్ చూపులేనివాడిగా కనిపించడం రిస్క్ అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.
అయితే సినిమా మొత్తం చూపులేనివాడిగా కనిపిస్తాడా.. ? లేక కొంత సమయం వరకు కనిపిస్తాడా.. ? అనేది తెలియాల్సి ఉంది. అఖిల్ ఇలాంటి పాత్ర చేసి రిస్క్ తీసుకుంటున్నాడు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఈ సినిమాపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. అఖిల్ కి ఇప్పటివరకు హిట్ లేదు. ఇలాంటి సమయంలో ఒక మంచి స్టోరీతో వస్తే యావరేజ్ టాక్ అందుకున్నా కొంతవరకు బయటపడొచ్చు. మరి ఈ సమయంలో ఇలాంటి ప్రయోగాలు అవసరమా అని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది చూడాలి.