Akhil Akkineni: అఖిల్ సినిమా కోసం బడా విలన్
ABN , Publish Date - Jan 04 , 2025 | 07:57 AM
వాస్తవానికి ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ చేయబోయే సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఉంటుందనేలా ఏడాది కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది కానీ.. ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళుతున్నట్లుగా అయితే ఎటువంటి అప్డేట్ ఇంత వరకు రాలేదు. ఆ ప్రాజెక్ట్ సంగతి ఏమోగానీ..
అక్కినేని హీరో అఖిల్ ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే కొన్నేళ్ల గ్యాప్ తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ మూవీలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ లోని ఓ ఉత్తమ నటుడిని పరిశీలిస్తున్నారట. ఆయనెవరో కాదు ‘1992 స్కామ్’ సిరీస్ తో ఇండియన్ వైడ్ గా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రతీక్ గాంధీ. ప్రస్తుతం ఆయన వరుస బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఒకవేళ ప్రతీక్ డేట్ లు అడ్జెస్ట్ కాకపోతే తమిళ నటుడు విక్రాంత్‌ను విలన్‌గా చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ చేయబోయే సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఉంటుందనేలా ఏడాది కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది కానీ.. ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళుతున్నట్లుగా అయితే ఎటువంటి అప్డేట్ ఇంత వరకు రాలేదు. ఆ ప్రాజెక్ట్ సంగతి ఏమోగానీ.. ప్రస్తుతం ఓ యువ దర్శకుడు చెప్పిన స్టోరీ నచ్చటంతో అఖిల్ సినిమాకి ఓకే చెప్పాడట.కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి హిట్టు సినిమా తీసిన మురళీ కిషోర్ చెప్పిన కథ నచ్చడంతో.. అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా తిరుపతి బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్‌కు అనుబంధంగా మనం ఎంటర్‌ప్రైజెస్ అనే బ్యానర్‌లో ఈ సినిమాను నాగార్జున, చైతన్యనిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 'లెనిన్' అనే టైటిల్ ని పరీశీలిస్తున్నారు. సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించనుంది.