Harshaali: బాలకృష్ణ గారు.. వెరీ ఎనర్జిటిక్, అన్‌స్టాపబుల్
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:53 AM
బాలకృష్ణ ( Balakrishna) వంటి లాంటి లెజండరీ యాక్టర్‌తో కలసి నటించడం నిజంగా నా అదృష్టమని నటి హర్షాలి మల్హోత్రా అన్నారు.
‘బాలకృష్ణ ( Balakrishna) వంటి లాంటి లెజండరీ యాక్టర్‌తో కలసి నటించడం నిజంగా నా అదృష్టం. సెట్‌లో ఆయన చిత్ర బృందంతో సరదాగా ఉన్నారు. తెలుగు సినిమాకు కొత్త వ్యక్తిని అయిన నన్ను ఎంతో ప్రోత్సహించారు. బాలకృష్ణగారు వెరీ ఎనర్జిటిక్, అన్‌స్టాపబుల్’ అని అన్నారు నటి హర్షాలి మల్హోత్రా (Harshaali Malhotra).
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2 ) లో ఆమె కీలక పాత్ర పోషించారు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ బేనర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఈనెల 5న విడుదలవుతున్న సందర్భంగా హర్షాలి మీడియాతో మాట్లాడారు.
దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ తెరముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘బంజరంగీ భాయిజాన్’ చిత్రం తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఈ సమయంలో చదువుపై దృష్టి పెట్టాను. అలాగే కథక్ నృత్యం కూడా నేర్చుకున్నాను. ఒక మంచి పాత్ర కోసం ఎదురు చూస్తున్నప్పుడు ‘అఖండ 2’లో అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో నేను జననీ అనే పాత్రలో కనిపిస్తాను. జననీ జీవితం ప్రమాదంలో పడినప్పుడల్లా అఖండ వచ్చి రక్షిస్తాడు. ఈ సినిమాలో నేను కొన్ని యాక్షన్ స్టంట్స్ కూడా చేశాను.
డైరెక్టర్ బోయపాటి గారు ‘నువ్వు తప్పకుండా చేయగలవు’ అని ఎంతో ప్రోత్సహించే వారు. సన్నివేశం పూర్తయిన తర్వాత ‘అద్భుతంగా చేశావ’ని అభినందించే వారు. నాకు సంజయ్ లీలా బన్సాలీ గారి సినిమాలో నటించాలని ఉంది. ఆయన హీరోయిన్లని చూపించే విధానం అద్భుతంగా ఉంటుంది.