Akhanda 2: ఏపీ, తెలంగాణల్లో.. థియేటర్లు దద్దరిల్లుతున్నాయి! ప్రీమియర్ షో 10 కోట్లు దాటింది
ABN , Publish Date - Dec 12 , 2025 | 07:38 PM
‘కొన్ని అనివార్య, ఊహించని కారణాల వల్ల సినిమా వారం రోజులు వాయిదా పడింది. అందుకు బాలయ్యబాబుకి, దర్శకుడు, అభిమానులకు క్షమాపణ చెబుతున్నాం.
‘కొన్ని అనివార్య, ఊహించని కారణాల వల్ల సినిమా వారం రోజులు వాయిదా పడింది. అందుకు బాలయ్యబాబుకి, దర్శకుడు, అభిమానులకు క్షమాపణ చెబుతున్నాం. లేట్ అయినా సినిమాకు స్పందన బావుంది. థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి’ అని నిర్మాతలు రామ్ ఆచంట(Ram achanta), గోపీచంద్ ఆచంటా అన్నారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన ‘అఖండ 2: ది తాండవం’ (akhanda 2). శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచించంది. ఈ సినిమాకొస్తున్న స్పందన గురించి నిర్మాతలు మీడియాతో మాట్లాడారు.
నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ ‘కొన్ని అనివార్య, ఊహించని కారణాల వల్ల సినిమా వారం రోజులు వాయిదా పడింది. అందుకు బాలయ్యబాబుకి, దర్శకుడు, అభిమానులకు క్షమాపణ చెబుతున్నాం. మాకు ఎదురైన సమస్యను పరిష్కరించడానికి నిర్మాత దిల్ రాజు. మ్యాంగో మీడియా రామ్, ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా ఆలస్యమైనా ప్రీమియర్స్‌తో రిలీజ్ అయింది. అభిమానులతో కలిసి భ్రమరాంబ ఽథియేటర్‌లో సినిమా చూశాం. అద్భుతమైన స్పందన ప్రేక్షకులు సీట్లలో కూర్చోవడం లేదు. ఈలలు, అరుపులతో హంగామా చేస్తున్నారు. అన్ని ఏరియాల నుంచి కలెక్షన్లు బావున్నాయి. నార్త్‌లో జీ సినిమాస్ ద్వారా దాదాపు 800 స్క్రీన్లలో రిలీజ్ చేశాం. అక్కడ కూడా బావుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సక్సెస్ సెలబ్రేషన్స్ చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు.
రామ్ ఆచంట మాట్లాడుతూ.. ప్రీమియర్స్ రెస్పాన్స్ అదిరిపోయింది. నిన్న నైజాం, సీడెడ్, ఆంధ్రాతో కలిపి 10 కోట్లు గ్రాస్ చేసింది. కర్ణాటకలో కూడా దాదాపు కోటి కలెక్ట్ చేసింది. ప్రీమియర్స్‌లో కోటి రూపాయలు కలెక్ట్ చేసిన నాన్ కన్నడ సినిమాల్లో ఇది ఐదో సినిమా. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి చాలా అద్భుతమైన రిపోర్ట్స్ వస్తున్నాయి. శుక్రవారం ఈవినింగ్ నుంచి ఫ్యామిలీస్ కూడా తోడవుతారు. వీకెండ్‌కి అదిరిపోయే ఫిగర్స్ చూస్తామనే నమ్మకం ఉంది. రిలీజ్ తర్వాత అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇండస్ట్రీలో మాత్రం సినిమాకు కాస్త మిక్స్‌డ్ టాక్ ఉంది. గ్రౌండ్ రిపోర్టు చాలా ఎక్సలెంట్‌గా ఉంది. బాలయ్య అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు’ అన్నారు.