Akhanda2: ఇక‌.. ఆర్‌ఎఫ్‌సీలో 'అఖండ 2 తాండవం

ABN , Publish Date - Jun 15 , 2025 | 07:43 PM

‘సింహ, లెజెండ్ మరియు అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాల తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వ‌స్తోన్న నాల్గవ చిత్రం ‘అఖండ 2’

akhanda2

‘సింహ, లెజెండ్ మరియు అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాల తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna), బోయపాటి (Boyapati Srinu) కాంబోలో వ‌స్తోన్న నాల్గవ చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2). సంయుక్త (Samyuktha) క‌థానాయిక‌గా న‌టిస్తోండ‌గా, ఆది పినిశెట్టి ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తోంది. ఇటీవ‌ల బాలకృష్ణ పుట్టినరోజుకు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కు నేషనల్ వైడ్ గా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ తో టీజర్ అదరగొట్టింది.

అయితే.. ఇటివలే జార్జియాలోని కొన్ని అద్భుతమైన‌ లోకేషన్స్ ల‌లో ఈ సినిమాకు సంబంధించి కీలకమైన యాక్షన్ సీన్స్ ని చిత్రీక‌ర‌ణ పూర్తి చేసిన మేక‌ర్స్ హైద‌రాబాద్‌కు వ‌చ్చేశారు. తిరిగి ఆర్‌ఎఫ్‌సీలో కొత్త షెడ్యూల్ ప్రారంభించ‌నుడ‌గా బాలకృష్ణతో పాటు యూనిట్ స‌భ్యులపై ప్ర‌ధాన స‌న్నివేశాల‌ను చిత్రీకరించనున్నారు. కాగా ఈమూవీకి S థమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న అఖండ 2 పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ చేయ‌నున్నారు.

Updated Date - Jun 15 , 2025 | 07:58 PM