Akhanda 2 Release Teaser: ఎవడ్రా విభూది కొండను ఆపేది.. తాండవంకి సిద్ధం కండి

ABN , Publish Date - Dec 10 , 2025 | 08:23 PM

కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న రచ్చకు ఫుల్ స్టాప్ పడింది. ఎట్టకేలకు అఖండ 2 తాండవం కొత్త రిలీజ్ డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

akhanda 2 thaandavam

Akhanda 2 Release Teaser: కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న రచ్చకు ఫుల్ స్టాప్ పడింది. ఎట్టకేలకు అఖండ 2 తాండవం కొత్త రిలీజ్ డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖండ 2 తాండవం (Akhanda- 2 thaandavam). డిసెంబర్ 5వ తేదీ రిలీజ్ కావలసిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్నీ క్లియర్ చేసుకొని డిసెంబర్ 12న ప్రేక్షకులను పలకరించనుంది. డిసెంబర్ 11వ తేదీ రాత్రి నుండే అఖండ-2 ప్రీమియర్ షోస్ మొదలు కానున్నాయి. ఈ సారైనా పక్కాగా వస్తుందా అన్న అనుమానాలు కొందరిలో ఉన్నాయి... అయితే ఈ దఫా నిర్మాతలు సరైన జాగ్రత్తలు తీసుకొని అఖండ-2- తాండవంను రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ గొడవల వలన అఖండ 2 కి రావాల్సిన హైప్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా నాయి ఫ్యాన్స్ వేయి కళ్ళతోఎదురుచూస్తున్నారు. అలాంటివారికి మారినంత జోష్ తెప్పించడానికి మేకర్స్ రిలీజ్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో సిచ్యువేషన్ కి సింక్ అయ్యేలా డైలాగ్స్ ఉండడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అఖండ 2 ఆగిపోతుందని అందరూ మాట్లాడుకున్నారు. ఇక మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లు.. బాలయ్య.. ఎవడ్రా విభూది కొండను ఆపేది అంటూ ఉగ్రరూపం చూపించాడు.

'లోక క్షేమం కోరావు.. ఇక నీ క్షేమం ఆ శివుని అధీనం' అంటూ బాలయ్య బేస్ వాయిస్ తో టీజర్ మొదలయ్యింది. హైందవం గురించి ఈ సినిమాలో చర్చించినట్లు ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. దానిని కూడా టీజర్ లో చూపించారు. తన తమ్ముడు కూతురుని కాపాడడానికి అఖండ ఏం చేశాడు అనేది సినిమాగా తెలుస్తోంది. ఇక దానికి క్షుద్ర శక్తిని యాడ్ చేశారు. నరదృష్టి.. పరదృష్టి.. సమస్త దృష్టి .. నశి అని బాలయ్య సినిమాకు పట్టిన దిష్టి మొత్తం పోయేలా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. థమన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Dec 10 , 2025 | 09:33 PM