Akhanda 2: అఖండ 2 స్పెషల్ షోలు రద్దు..
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:25 PM
‘అఖండ -2: తాండవం’ చిత్రానికి చిక్కులు తప్పడం లేదు. ఈ నెల 5న విడుదల కావలసిన ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడి ఈ శుక్రవారం విడుదల చేసేలా లైన్ క్లియర్ చేశారు. అయితే ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది.
‘అఖండ -2: తాండవం’ (Akhanda 2 Thandavam) చిత్రానికి చిక్కులు తప్పడం లేదు. ఈ నెల 5న విడుదల కావలసిన ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడి ఈ శుక్రవారం విడుదల చేసేలా లైన్ క్లియర్ చేశారు. అయితే ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. తెలంగాణ హైకోర్టులో పెద్ద షాక్ (big shock to Akhanda 2) తగిలింది. సినిమా ప్రీయయర్ షోలు, టికెట్ ధర పెంచుతూ ఇచ్చిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఈ సినిమా ప్రీమియర్ షోలు గురువారం రాత్రి వేయడానికి సన్నాహాలు చేశారు. ఈ క్రమంలో 'అఖండ 2 తాండవం' సినిమా టికెట్ ధర పెంపు వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు టికెట్ ధరల పెంపుతోపాటు ప్రత్యేక షోల నిర్వహాణపై కూడా విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. ‘అఖండ 2’ మూవీ టికెట్ హైక్స్ ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని రద్దు చేయాలని కోరుతూ శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.
అఖండ 2 సినిమా టికెట్ ధరలను ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ ఇటీవల అనుమితి ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై రూ.50, మల్టీప్లెక్స్ లో రూ.100 అదనంగా వసూలు చేసుకోవచ్చు. డిసెంబర్ 11న ప్రదర్శించే ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఈ అనుమతితోపాటు సినిమా టీమ్‌కు ఓ షరతు విధించింది. టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు లాభాల్లో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి తప్పనిసరిగా కేటాయించాలని ఆదేశించింది.