Akhanda 2 Makers: రూమర్లు నమ్మవద్దు.. ప్రీమియర్స్ పక్కా

ABN , Publish Date - Dec 11 , 2025 | 06:29 PM

‘అఖండ 2: తాండవం’(Akhanda 2) సినిమా ప్రీమియర్‌ షోలు రద్దంటూ వస్తున్న వార్తల్ని నమ్మవద్దని నిర్మాతలు ప్రేక్షకులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

‘అఖండ 2: తాండవం’(Akhanda 2) సినిమా ప్రీమియర్‌ షోలు రద్దంటూ వస్తున్న వార్తల్ని నమ్మవద్దని నిర్మాతలు ప్రేక్షకులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రణాళిక ప్రకారమే అఖండ2 గ్రాండ్‌ ప్రీమిమర్‌ షోలు ప్రొజెక్ట్‌ అవుతాయని, మీకు దగ్గర థియేటర్లలో ‘అఖండ 2ఫ తాండవం’ చిత్రాన్ని ఆస్వాదించండి అంటూ మేకర్స్‌ ప్రకటన చేశారు. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సినిమా విడుదలకు అన్నీ క్లియర్‌ అయ్యి, ప్రత్యేక షోలు, టికెట్‌ ధర పెంపునకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వగా  తెలంగాణ హైకోర్టులో పెద్ద షాక్‌ (big shock to Akhanda 2) తగిలింది.

సినిమా ప్రీమియర్ షోలు, టికెట్‌ ధర పెంచుతూ ఇచ్చిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు మేకర్స్ స్పందించారు. ప్రీమియర్ షో లు యథాతధంగా ఉంటాయని చెప్పారు. నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'అఖండ 2 తాండవం' . బోయపాటి శ్రీను దర్శకుడు. 14 రీల్స్ ప్లస్ సంస్థపై గోపి ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. ఈ శుక్రవారం ఏ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 

Updated Date - Dec 11 , 2025 | 06:43 PM