Nandamuri Balakrishna: 600 మంది డ్యాన్సర్లతో.. రచ్చ రంబోలా.. 

ABN , Publish Date - Sep 21 , 2025 | 12:15 PM

మాస్‌కు కేరాఫ్‌ నందమూరి బాలకృష్ణ. ఆయనకు తోడు బోయపాటి శ్రీను కలిస్తే ఇక ఊరమాసే. వీరిద్దరి సినిమా అంటూ అభిమానుల అంచనాలు కూడా ఊరమాస్‌ స్థాయిలో ఆకాశాన్ని తాకుతుంటాయి.


మాస్‌కు కేరాఫ్‌ నందమూరి బాలకృష్ణ (NBK). ఆయనకు తోడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కలిస్తే ఇక ఊరమాసే. వీరిద్దరి సినిమా అంటూ అభిమానుల అంచనాలు కూడా ఊరమాస్‌ స్థాయిలో ఆకాశాన్ని తాకుతుంటాయి.  వీరిద్దరి కలయిక వస్తున్న నాలుగో చిత్రం అఖండ-2: తాండవం(akhanda 2) . సంయుక్త మీనన్‌ కథానాయిక. ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపిస్తారు. ఎం.తేజస్విని సమర్పణలో 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌  ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.

ప్రత్యేకంగా వేసిన సెట్‌లో 600 మంది డ్యాన్సర్ల నేపథ్యంలో బాలకృష్ణపై మాస్‌ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు. భాను మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ‘బాలకృష్ణ మాస్‌ మూమెంట్స్‌తోనూ... తమన్‌ బాణీతోనూ అదిరిపోయేలా ఈ పాట ఉంటుంది. థియేటర్లలో అభిమానుల్ని, ప్రేక్షకుల్నీ ఉర్రూతలూగించడం పక్కా. భారీ హంగుల మధ్య చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో బాలకృష్ణ మునుపెన్నడూ కనిపించని రీతిలో, ఉగ్రమైన అవతారంలో కనిపిస్తారని చిత్ర బృందం తెలిపింది.  

Updated Date - Sep 21 , 2025 | 12:19 PM