Akhanda 2: 'జాబికాయ...' పాట వచ్చేసిందిరోయ్...

ABN , Publish Date - Dec 25 , 2025 | 05:22 PM

'అఖండ -2' నుండి అవుట్ అండ్ అవుట్ మాస్ సాంగ్ 'జాజికాయ' వీడియో వర్షన్ విడుదలైంది. బాలకృష్ణ, సంయుక్త జంటపై ఈ పాటను చిత్రీకరించారు.

Jaajikaaya Song out

నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna) ద్విపాత్రాభినయం చేసిన 'అఖండ -2' (Akhanda 2) సినిమా డిసెంబర్ 12న జనం ముందుకొచ్చింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక 'అఖండ 2'లో ఉన్న అవుట్ అండ్ అవుట్ మాస్ సాంగ్ 'జాజి కాయ' వీడియోను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. ఈ పాట ప్రారంభంలో సింగర్ గీతా మాధురి కనిపించడం ఓ విశేషం.


ఈ పాటను సినిమాలో పాడింది మాత్రం గీతా మాధురి కాదు. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను బ్రిజేష్‌ శాండిల్య, శ్రేయా ఘోషల్ పాడారు. భాను కొరియోగ్రఫీ అందించారు. ఫుల్ మాస్ బీట్ తో సాగిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ రచన చేశారు. థియేటర్లలో బాలకృష్ణ అభిమానులతో విజిల్స్ వేయించిందీ పాట. అలానే సంయుక్త తన ఇమేజ్ కు భిన్నంగా పూర్తి గ్లామరస్ గా ఇందులో కనిపించింది. ఇదిలా ఉంటే... తాజాగా 'అఖండ 2' చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను... చినజియ్యర్ స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు.

WhatsApp Image 2025-12-24 at 10.30.54 PM (1).jpeg

Updated Date - Dec 25 , 2025 | 05:52 PM