Akhanda 2: 'అఖండ తాండవం' .. సౌండ్ దద్దరిల్లడం ఖాయం
ABN , Publish Date - Nov 05 , 2025 | 09:19 PM
'అఖండ(Akhanda)' సాధించిన సంచలన విజయం అప్పట్లో కేవలం బాలకృష్ణ (Balakrishna) అభిమానులనే కాకుండా, సినీ గోయెర్స్ అందరినీ అలరించింది.
Akhanda 2: 'అఖండ(Akhanda)' సాధించిన సంచలన విజయం అప్పట్లో కేవలం బాలకృష్ణ (Balakrishna) అభిమానులనే కాకుండా, సినీ గోయెర్స్ అందరినీ అలరించింది. దాంతో 'అఖండ' సీక్వెల్ మొదలైనప్పటి నుంచీ అందరిలోనూ ఓ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అందుకు కారణం ఈ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) ఇప్పటి దాకా బాలయ్యతో తెరకెక్కించిన మూడు చిత్రాలు బంపర్ హిట్స్ గా నిలవడమే. ఇక అఖండ 2 చిత్రాన్ని 14 రీల్స్ అధినేతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటతో కలసి బాలకృష్ణ చిన్నకూతురు తేజస్విని నిర్మిస్తున్నారు. అందువల్ల బాలయ్య ఫ్యాన్స్ 'అఖండ-2'పై మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు - ఈ మధ్యే తేజస్విని సిద్ధార్థ్ జ్యువెలరీ యాడ్ లో నటించి జనం ముందు నిలిచారు... అందువల్ల తేజస్విని పట్ల మరింత ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో వస్తోన్న 'అఖండ-2'కు కూడా సర్వత్రా పాజిటివ్ బజ్ నెలకొందని చెప్పవచ్చు.
'అఖండ-2- తాండవం' నుండి ఓ స్పెషల్ న్యూస్ కార్తిక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 5న వెలువడుతుందని వినిపించిన విషయం తెల్సిందే. కొద్దిగా ఆలస్యంగా అయినా ఆ అప్డేట్ ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే 'అఖండ-2'లోని ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన విషయాన్నే పంచుకున్నారు. అఖండ తాండవం అంటూ సాగే మొదటి సింగిల్ ప్రోమోను నవంబర్ 7 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక తాండవం సాంగ్ అంటున్నారు అంటే.. థమన్ ఇంకోసారి డ్యూటీ ఎక్కినట్లే కనిపిస్తున్నాడు. ఈసారి కూడా సౌండ్ దద్దరిల్లడం ఖాయమనపిస్తుంది. ఇక ఈ తాండవంలో బాలయ్య డ్యాన్స్ కూడా ఉండబోతుందని సమాచారం.. ఇక శివుడి ముందు తాండవం.. బాలయ్య నట విశ్వరూపం చూపించబోతున్నాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే అఖండ 2 డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో బాలయ్య - బోయా ఎలాంటి రికార్డ్లు సృష్టిస్తారో చూడాలి.