Ajith Kumar: అజిత్‌కు తప్పిన ప్రాణాపాయం

ABN , Publish Date - Jul 21 , 2025 | 05:07 AM

కారు రేసింగ్‌ పోటీల్లో పాల్గొన్న హీరో అజిత్‌ కుమార్‌ కారు మరోమారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి...

కారు రేసింగ్‌ పోటీల్లో పాల్గొన్న హీరో అజిత్‌ కుమార్‌ కారు మరోమారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇటలీలో జీటీ 4 కార్‌ రేసింగ్‌ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో అజిత్‌ కుమార్‌ రేసింగ్‌ జట్టు కూడా పాల్గొంటోంది. ఆ సందర్భంగా అజిత్‌ కుమార్‌ నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ పోటీల్లో ముందుభాగంలో దూసుకెళుతున్న కారు ఒకటి ఉన్నట్టుండి అడ్డుగా రావడంతో ఆ కారును అజిత్‌ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం దెబ్బతింది. అయితే, అజిత్‌ మాత్రం అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.

చెన్నై (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jul 21 , 2025 | 05:08 AM