విడుదల తేదీ ఖరారు
ABN , Publish Date - Jun 21 , 2025 | 06:52 AM
బాలీవుడ్ నటులు అజయ్ దేవ్‌గణ్, సంజయ్ దత్ ప్రధాన పాత్రధారులుగా విజయ్ కుమార్ అరోరా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ కామెడీ చిత్రం ‘సన్నాఫ్ సర్దార్-2’. మృణాల్ ఠాగూర్ కథానాయిక.
బాలీవుడ్ నటులు అజయ్ దేవ్‌గణ్, సంజయ్ దత్ ప్రధాన పాత్రధారులుగా విజయ్ కుమార్ అరోరా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ కామెడీ చిత్రం ‘సన్నాఫ్ సర్దార్-2’. మృణాల్ ఠాగూర్ కథానాయిక. దేవ్‌గణ్ ఫిల్మ్స్, జియో స్టూడియో సంస్థలు నిర్మిస్తున్నాయి. 2012లో విడుదలైన ‘సన్నాఫ్ సర్దార్’కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. కాగా, తాజాగా సినిమా విడుదల తేదీని అజయ్ దేవ్‌గణ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కొత్త పోస్టర్‌ని షేర్ చేశారు. ‘మీ సమీప థియేటర్లలోకి జూలై 25న ‘సన్నాఫ్ సర్దార్-2’ వస్తున్నాడు’ అంటూ తెలిపారు.