Aishwarya Rajesh: కొన్ని పాత్రలు గుర్తుండిపోతాయి.. భాగ్యం అలాంటిదే..
ABN, Publish Date - May 12 , 2025 | 08:59 PM
వెంకటేశ్ (Venkatesh) , మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ (Aishwarya Rajesh) కీలక పాత్రధారులుగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
వెంకటేశ్ (Venkatesh) , మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ (Aishwarya Rajesh) కీలక పాత్రధారులుగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై రూ. 310 కోట్లకు పైగానే రాబట్టింది. ఇందులో ఐశ్వర్య రాజేశ్ నటించిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. వెంకటేశ్ భార్యగా తనదైన స్టైల్లో నటించి ప్రేక్షుల్ని మెప్పించింది. ఈ సినిమాలో తన నటనకు గానూ ఐశ్వర్య రాజేశ్ క్రేజీ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో అందించే అప్సర అవార్డ్ ఐశ్వర్య రాజేశ్‌ను వరించింది. ఈ ఏడాది ఉత్తమ నటిగా ఐశ్వర్య రాజేశ్ అవార్డ్ అందుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భాగ్యం లాంటి పాత్ర ఇచ్చినందుకు అనిల్ రావిపూడిని ప్రశంసించారు. కొన్ని సినిమాలు కెరీర్‌కు ప్రత్యేకంగా నిలుస్తాయి. కొన్ని పాత్రలైతే ఎప్పటికీ మర్చిపోలేం. సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో భాగ్యం పాత్ర అలాంటిదే. ఈ పాత్ర ఇచ్చిన అనిల్‌గారికి రుణపడి ఉంటా. ఆయన కాకపోతే ఈ పాత్ర అంతగా పండేది కాదు’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.