Thiruveer: తిరువీర్.. కొత్త సినిమా షురూ

ABN , Publish Date - Nov 17 , 2025 | 10:03 AM

ఇటీవ‌ల ది గ్రేట్‌ ఫ్రీ వెడ్డింగ్ సో అనే చిత్రంతో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న తిరువీర్ (Thiruveer) హీరోగా ఆదివారం ఓ నూతన చిత్రంప్రారంభ‌మైంది.

Thiruveer

ఇటీవ‌ల ది గ్రేట్‌ ఫ్రీ వెడ్డింగ్ సో అనే చిత్రంతో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న తిరువీర్ (Thiruveer) హీరోగా ఆదివారం ఓ నూతన చిత్రంప్రారంభ‌మైంది. మహేందర్‌ కుడుదుల (Mahender Kududula) దర్శకత్వంలో పరుచూరి వేంకటేశ్వర రావు (Paruchuri Venkateswara Rao) నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వివేక్‌ ఆత్రేయ క్లాప్ ఇవ్వ‌గా.. ఫిల్మ్‌ ఛాంబర్‌ సెక్రటరీ దామోదరప్రసాద్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు.

Thiruveer

నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు. ‘పల్లెటూరి నేపథ్యంలో సాగే అద్భుతమైన ప్రేమకథతో ఈ చిత్రం రూపొందుతోంది. వినోదంతో పాటు కదిలించే భావోద్వేగాలు ఉంటాయి’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జగదీశ్‌ చీకటి.

Thiruveer

Updated Date - Nov 17 , 2025 | 10:03 AM