DRIVE: చాన్నాళ్ల‌కు.. తెలుగులో సోలో హీరోగా ఆది పినిశెట్టి! డ్రైవ్.. టీజ‌ర్

ABN , Publish Date - Dec 04 , 2025 | 06:14 PM

ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) సోలో హీరోగా చాలా కాలం త‌ర్వాత తెలుగులో న‌టించిన చిత్రం డ్రైవ్‌.

DRIVE

ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) సోలో హీరోగా చాలా కాలం త‌ర్వాత తెలుగులో న‌టించిన చిత్రం డ్రైవ్‌. భ‌వ్య క్రియేష‌న్స్ (Bhavya Creations) బ్యాన‌ర్‌పై ఆనంద్ ప్ర‌సాద్ (V Ananda Prasad) ఈ సినిమాను నిర్మించ‌గా జెనూస్ మొహమ్మద్ (Jenuse Mohamed) ద‌ర్శ‌కత్వం వ‌హించాడు. మ‌ల‌యాళ బ్యూటీ మ‌డోన్నా సెబాస్టియ‌న్ (Madonna Sebastian) క‌థానాయిక‌గా చేసింది.

క‌మ‌ల్ కామ‌రాజు (Kamal Kamaraju), అనీష్ కురివిల్లా (Anish Yohan Kuruvilla ) ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. ఔట్ అండ్ ఔట్ థ్రిల్లింగ్ , స‌ర్వైవ‌ల్ జాన‌ర్‌లో రూపొందిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 12న ప్ర‌పంచ వ్చాస్తంగా థియేట‌ర్ల‌కు తీసుకు వ‌స్తున్నారు. ఈనేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా ఈ చిత్రం టీజ‌ర్ రిలీజ్ చేశారు.

టీజ‌ర్ చూస్తుటే.. నేటి స‌మాజాన్ని క‌బ‌లిస్తున్న సైబ‌ర్ క్రైమ్స్‌, హ్యాకింగ్స్ నేప‌థ్యంలో సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. విదేశాల్లో బిలియ‌నీర్ అయిన ఓ మీడియా అధినేత నెట్‌వర్క్ ను హ్యాక్ చేస్తే ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌య్యాయి, హీరో దానిని ఎలా ఎదుర్కొన్నాడ‌నే ఇంట్రెస్టింగ్ క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా రూపొందింది.

Updated Date - Dec 04 , 2025 | 06:14 PM