Adivi Sesh: శేష్ సినిమాలంటే పారిపోతున్న హీరోయిన్లు..

ABN , Publish Date - Jan 08 , 2025 | 01:07 PM

Adivi Sesh: యంగ్‌ హీరో అడివి శేష్‌ ఓ సమస్యను ఎదుర్కొంటున్నాడు. వరుసగా ఆయన సినిమాల నుండి హీరోయిన్లు ఛేంజ్ అవుతున్నారు.

adivi sesh

టాలీవుడ్‌కి హీరోయిన్ల కొరత కొత్తేమీ కాదు. అగ్ర హీరోలతో పాటు యువ హీరోలకు ఇదే సమస్య. సీనియర్‌ హీరోయిన్‌లతోపాటు యంగ్‌ హీరోయిన్లు ఓ డజను మంది ఉన్నప్పటికీ కాంబినేషన్‌ లేదా ఇతర సమస్యలతో ఓ పట్టాన సెట్‌ కావట్లేదు. సీనియర్‌ హీరోల సరసన నటించడానికి యంగ్‌ హీరోయిన్లు అంగీకరించట్లేదనే టాక్‌ ఉంది. అయితే యంగ్‌ హీరోలకు సైతం ఇదే సమస్య. ఇలాంటి సమస్యను యంగ్‌ హీరో అడివి శేష్‌ (Adivi Sesh) ఎదుర్కొంటున్నాడు. వరుసగా ఆయన సినిమాల నుండి హీరోయిన్లు ఛేంజ్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరుగుతుందంటే..


'మేజర్‌', 'హిట్‌–2' చిత్రాల సక్సెస్‌ తర్వాత ఆయన ఏడాది గ్యాప్‌ తీసుకున్నారు. ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘గూఢచారి’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాకు కొనసాగింపుగా జీ 2’ (G2)ప్రారంభించారు. ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన షానీల్‌ డియోను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘డకాయిట్‌’ (Dacoit) సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు చిత్రాలలో హీరోయిన్లు మారిపోయారు. అయితే మేజర్‌ సినిమా సక్సెస్‌తో శేష్‌కి నార్త్‌లో కూడా మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఆ క్రేజ్‌తో అతని సినిమాలో యాక్ట్‌ చేయడానికి బనితా సందు ఎగ్జైట్‌ అయ్యింది. వరుణ్‌ ధావన్‌ సరసన ‘అక్టోబర్‌’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైందీ బ్యూటీ. ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. తదుపరి విక్కీ కౌశల్‌ ‘సర్దార్‌ ఉధమ్‌’లో కూడా యాక్ట్‌ చేసింది. ఆ సమయంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శేష్‌ సినిమాల్లో నటించాలనుందనే విషయాన్ని వెల్లడించింది. ‘గూఢచారి 2’లో కీలక పాత్రకు ఎంపికైంది. అయితే ఇప్పుడు ఆమె ఆ చిత్రం నుంచి తప్పుకుంది. ఎందుకు ఈ సినిమా నుంచి బయటకు వెళ్లిందనే విషయం తెలియాల్సి ఉంది. ‘గూఢచారి 2’ నుంచి బనితా సందు తప్పుకొన్న కొన్ని రోజులకే ‘డకాయిట్‌’ సినిమా నుంచి శృతి హాసన్‌ కూడా ఎగ్జిట్‌ అయింది. కొన్ని రోజులుగా ఈ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ‘డకాయిట్‌’కు కాల్షీట్‌ సర్దుబాటు కాక శృతి హాసన్‌ తప్పుకొన్నారని యూనిట్‌ మెంబర్స్‌ నుంచి లీక్స్‌ వస్తున్నాయి. కానీ, అసలు విషయం వేరని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. క్రియేటివ్‌ ఇష్యూస్‌ కూడా ఉన్నాయని తెలుస్తోంది. దర్శకుడు విహారంలో ఉండగా పలు సన్నివేశాలను శేష్‌ డైరెక్ట్‌ చేసే ప్రయత్నం చేశాడని, అది నచ్చకే శ్రుతీహాసన్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకొందని మరో టాక్‌ నడుస్తోంది. ఇందులో నిజమెంత అనేది మేకర్స్‌ నోరు విప్పితే తప్ప తెలీదు. దీంతో ‘డకాయిట్‌’ లో శృతి ప్లేస్ ని మృణాల్ ఠాకూర్, 'జీ2' లో బనితా సందు రోల్ ని వామికా గబ్బి రీప్లేస్ చేసింది.

Updated Date - Jan 08 , 2025 | 01:10 PM