Aditi Rao Hydari: ఫేక్ వాట్సాప్ ఖాతా! నా పేరుతో.. సందేశాలు పంపిస్తున్నారు
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:37 AM
తన పేరు, ఫొటో ఉపయోగిస్తూ ఓ వ్యక్తి వాట్సాప్‌లో ఫేక్ ఖాతాను వాడుతున్నాడని, దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని నటి అదితిరావు హైదరి (Aditi Rao Hydari) సూచించారు.
తన పేరు, ఫొటో ఉపయోగిస్తూ ఓ వ్యక్తి వాట్సాప్‌లో ఫేక్ ఖాతాను వాడుతున్నాడని, దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని నటి అదితిరావు హైదరి (Aditi Rao Hydari) సూచించారు.
‘నా దృష్టికి వచ్చిన ఓ ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేసి, మీ అందర్నీ అప్రమత్తం చేయాలనుకుంటున్నాను. నా పేరుతో ఓ వ్యక్తి ఫొటోషూట్స్ పేరిట పలువురు ఫొటోగ్రాఫర్లకు సందేశాలు పంపిస్తున్నాడని తెలిసింది.

ఆ పని చేస్తున్నది నేను కాదు. ఫొటోషూట్స్ కోసం నేను వ్యక్తిగత ఫోన్ నెంబరుతో ఎవ్వరినీ సంప్రదించను. నా టీమ్ ద్వారానే నేను ఫొటోగ్రాఫర్స్‌ను సంప్రదిస్తాను. ఎవరైనా నా పేరుతో మీకు ఇలాంటి సందేశాలు పంపితే, వెంటనే మా టీమ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు తెలియజేయండి’ అని విజ్ఞప్తి చేశారు.