Trisha: అందం అసూయ ప‌డేలా ఉందే! త్రిష బ‌ర్త్‌ డే స్పెష‌ల్.. విశ్వంభ‌ర‌, థ‌గ్ లైప్ ఫ‌స్ట్ లుక్స్ రిలీజ్‌

ABN, Publish Date - May 04 , 2025 | 02:54 PM

వ‌య‌సు పెరిగినా త‌ర‌గ‌ని అందంతో వ‌రుస సినిమాలు చేస్తూ ద‌క్షిణాదిన‌ దూసుకుపోతుంది త్రిష. ఈరోజు త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా చిరు, క‌మ‌ల్ సినిమాల నుంచి ప్ర‌త్యేక‌ పోస్ట‌ర్లు ఫ‌స్ట్ లుక్స్ విడుదల చేశారు.

trisha

వ‌య‌సు పెరిగినా త‌ర‌గ‌ని అందంతో వ‌రుస సినిమాలు చేస్తూ ద‌క్షిణాదిన‌ దూసుకుపోతుంది త్రిష (Trisha). సినిమాల్లోకి వ‌చ్చి ఇర‌వై ఏండ్లు దాటినా వ‌న్నె త‌గ్గ‌ని సొగ‌సుతో నేటి కుర్ర హీరోయిన్ల‌కు సైతం పోటీగా సినిమాలు చేస్తూ ఔరా అనిపించుకుంటోంది.

పొన్నియ‌న్ సెల్వ‌న్‌, విజ‌య్ లియో, టొవినో థామ‌స్ ఐడెంటిటీ, అజిత్ విదాయుమురాచి, తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాల్లో న‌టించిన త్రిష ప్ర‌స్తుతం చిరంజీవి (Chiranjeevi) విశ్వంభ‌ర (vishwambhara), క‌మ‌ల్ హ‌స‌న్ (KamalHaasan ) థ‌గ్ లైఫ్ (ThugLife )చిత్రాల్లో న‌టిస్తోంది. నేటితో త్రిష (Trisha) 42వ వసంతంలోకి అడుగు పెట్టనుండ‌గా, కథానాయికగా చిత్ర రంగంలో అడుగుపెట్టి 23 ఏళ్ళు కావొస్తుంది.

ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని చిరు, క‌మ‌ల్ సినిమాల నుంచి పుట్టిన రోజు కానుక‌గా ప్ర‌త్యేక‌ పోస్ట‌ర్లు ఫ‌స్ట్ లుక్స్ విడుదల చేశారు. వాటిని చూసిన ఫ్యాన్స్ అంతా త్రిష మ‌రో ప‌దేళ్లు సినీ ఇండ‌స్ట్రీని ఏలుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. చాలామంది సెల‌బ్రిటీలు సైతం త్రిష‌(Trisha)కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

Updated Date - May 04 , 2025 | 03:10 PM