Srinidhi Shetty: స్పీడు.. పెంచిన శ్రీనిధి! వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ
ABN , Publish Date - Oct 22 , 2025 | 07:58 AM
ఇప్పటికే ఈ ఏడాది హిట్3 చిత్రంతో మంచి విజయం రుచి చూసిన శ్రీనిధి దీపావళికి తెలుసు కదా అనే సెన్సిబుల్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫిక్స్ అయ్యింది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh), దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని (Harika and Hassine Creations) చిత్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో కథానాయిక విషయంలో శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా అంటూ పలువురి పేర్లు తెర మీదకు వచ్చినా చివరకు కన్నడ నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)ని ఫైనల్ చేశారు. తాజాగా మంగళవారం శ్రీనిధి జన్మదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ శుభాకాంక్షలు తెలుపుతూ అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటికే ఈ ఏడాది హిట్3 చిత్రంతో మంచి విజయం రుచి చూసిన శ్రీనిధి దీపావళికి తెలుసు కదా అనే సెన్సిబుల్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది ఇలా ఉండగానే విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ వంటి ఆగ్ర స్థాయి టీమ్‌తో పని చేసే ఛాన్స్ దక్కడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుంగా పోయాయి. ఇప్పుడు ఈ చిత్రమే కాకుండా తమిళంతో అజిత్‌తో ఒకటి తెలుగులో మరో రెండు సినిమాలు సైతం అమ్మడి చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. ఇప్పటికే వెంకటేశ్ సూపర్ హిట్ చిత్రాలు ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్ రచన చేశారు. దీంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా తమన్ కాకుండా యానిమల్ ఫేం హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండడం విశేషం. కాగా ఈ మూవీ 2026 వేసవిలో ప్రేక్షకుల ఎదుటకు వచ్చే అవకాశం ఉంది.