Samyuktha: బాల‌కృష్ణ‌తో మాస్‌.. సాంగ్‌! నా మోకాలు.. దెబ్బతినింది

ABN , Publish Date - Dec 03 , 2025 | 07:00 AM

అఖండ 2 తాండవం చిత్రం రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థానాయిక సంయుక్త ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను మీడియాతో పంచుకుంది.

Samyuktha

అఖండ 2 తాండవం (Akhanda2 Thandavam) చిత్రంలో అవకాశం వచ్చినప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. ఒక మంచి సినిమాలో అవకాశం వస్తే తిరస్కరించకూడదని భావించి డేట్స్ అడ్జెస్ట్ చేసుకొని నటించాను. ఈ సిని మాలో కథను మలుపు తిప్పే పాత్ర పోషించాను' అని సంయుక్త (Samyuktha) అన్నారు. నందమూరి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అఖండ 2 తాండపం. నందమూరి తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. ఈ నెల 5న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా కథానాయిక సంయుక్త సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. అఖండ 2: తాండవం చిత్రం అంచనాలకు మించి ఉండబోతోంది. నేను మాటిస్తున్నా.. సినిమా అదిరిపోతుంది గూస్ బంప్స్ పక్కా అని అన్నారు. బోయపాటి గారు గ్రేట్ విజన్‌తో తెరకెక్కించారు. విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రంలో నా పాత్ర చాలా కీలకంగా, స్టైలిష్ గా ఉంటుంది. నా కెరీర్‌లో తొలిసారి ఓ మాస్ సాంగ్ చేశాను. ఇలాంటి మాస్ సాంగ్ ఇప్పటివరకూ చేయలేదు. చాలా కష్టపడ్డాను. ప్రాక్టీస్ చేసే సమయంలో మోకాలు దెబ్బతిని సహకరించకపోవడంతో పిజియోథెరపీ చేయించుకున్నా అన్నారు.

Samyuktha

బాలకృష్ణ దర్శకుల నటుడు. వారు ఎలా చెబితే అలా చేస్తారు. నటుడిగానూ ఆయన విజన్ అద్భుతం సెట్ లో ఆయన చాలా స్నేహంగా ఉండేవారు. ఆయన నటించిన 'డాకూ మహరాజ్ నా ఫేవరేట్ చిత్రం. తమన్ సంగీతం, ముఖ్యంగా సంస్కృత శ్లోకాలతో సాగే నేపధ్య సంగీతం ప్రేక్షకులను అలరిస్తుంది. మా నిర్మాతలు. రామ్, గోపి గారు మేకింగ్లో రాజీ పడ లేదు. సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసేందుకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కథానాయికగా స్వయంచు. నారీ నారీ నడుమ మురారి చిత్రాలు చేస్తున్నాను.

Samyuktha

Updated Date - Dec 03 , 2025 | 07:17 AM