Sai Pallavi: షాకింగ్‌.. బికినీలో సాయి ప‌ల్ల‌వి! ఫొటోలు వైర‌ల్.. షాక్‌లో నెటిజ‌న్లు

ABN , Publish Date - Sep 22 , 2025 | 05:58 AM

సాయి ప‌ల్ల‌వి.. ప్ర‌స్తుతం ఈ పేరు తెలియ‌ని ప్ర‌జ‌లు, సినీ ల‌వ‌ర్స్‌ ఉండరు. త‌న‌దైన శైలిలో మాత్ర‌మే చేస్తూ , అంగీక‌రిస్తూ కుటుంబ ప్రేక్ష‌కులకు బాగా చేరువైంది.

Sai Pallavi

సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi).. ప్ర‌స్తుతం ఈ పేరు తెలియ‌ని ప్ర‌జ‌లు, సినీ ల‌వ‌ర్స్‌ ఉండరు. త‌న‌దైన శైలిలో మాత్ర‌మే చేస్తూ , అంగీక‌రిస్తూ కుటుంబ ప్రేక్ష‌కులకు బాగా చేరువైంది. ముఖ్యంగా వారి ఇంటి ఆడ‌ప‌డుచుగా, ఇంట్లో అమ్మాయిగా కూడా మారింద‌న‌డంలో సందేహం లేదు.

 Sai Pallavi

గ్లామ‌ర్ అనే ప‌దానికి దూరంగా కేవ‌లం న‌ట‌న‌కూ ఆస్కార‌మున్న చిత్రాలు మాత్ర‌మే న‌టిస్తూ సావిత్రి, సౌంద‌ర్యల త‌ర్వాతి ప్లేసును వారి త‌ర‌హా గుర్దింపును సైతం సంపాదించుకుంది. టాలీవుడ్‌లో అయితే ఏకంగా లేడీ ప‌వ‌ర్ స్టార్ అనే స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది.

 Sai Pallavi

అయితే.. తాజాగా సాయి ప‌ల్ల‌వి బికినీలో క‌నిపించిన చిత్రాలు సామాజిక మాధ్య‌మాల్లో ద‌ర్శ‌ణ‌మిచ్చి పెద్ద దుమార‌మే రేపుతున్నాయి. గ‌త సంవ‌త్స‌రం వివాహం చేసుకుని విదేశాల్లో సెటిల్ అయిన చెల్లెలు పూజా క‌న్నన్ (Pooja kannan) తో క‌లిసి సాయి ప‌ల్ల‌వి వెకేష‌న్ ఎంజాయ్ చేస్తోంది.

 Sai Pallavi

ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు క‌లిసి స‌ముద్ర తీరంలో జ‌ల‌కాలాట‌ల‌లో మునిగి తేలారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌డంతో నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు. సాయి ప‌ల్ల‌వి ఏంటి బికినీ ఏంటి.. ఇది అస‌లు ఊహించ‌లేద‌ని అంటూ చ‌ర్చించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో ర‌చ్చ చేస్తున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

 Sai Pallavi

Updated Date - Sep 22 , 2025 | 07:13 AM