Cyber Abuse: నటి రమ్యకు శివరాజ్‌కుమార్ మద్దతు
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:35 AM
నటుడు దర్శన్ అభిమానులు తనకు వ్యతిరేకంగా పెట్టిన అసభ్య పోస్టులపై నటి రమ్య నగర పోలీస్ కమిషనర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు...
నటుడు దర్శన్ అభిమానులు తనకు వ్యతిరేకంగా పెట్టిన అసభ్య పోస్టులపై నటి రమ్య నగర పోలీస్ కమిషనర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. 43 సోషల్ మీడియా ఖాతాలను ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీపీ సీమంత్ కుమార్ సింగ్ విచారించాలని సీఈఎన్ పోలీసులను ఆదేశించారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా, నటి రమ్యకు శివరాజ్‌కుమార్, ఆయన భార్య గీతా శివరాజ్ మద్దతు ప్రకటించారు.
బెంగళూరు (ఆంధ్రజ్యోతి)