Nabha Natesh: గ్యారేజ్‌లో న‌భా.. ఫొటోలు అబ‌బ‌బ్బా

ABN , Publish Date - Aug 20 , 2025 | 05:51 AM

టాలీవుడ్‌ బ్యూటీ నభా నటేష్‌ కొత్తగా చేసిన ఫొటోషూట్‌ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా హీరోయిన్లు చేసే గ్లామర్ ఫొటోలకంటే డిఫరెంట్‌గా, కారు మెకానిక్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Nabha Natesh

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ద‌శాబ్దం కావ‌స్తున్నా ఇంకా అవ‌కాశాలు కోసం తంటాలు ప‌డుతోంది. క‌న్న‌డ క‌స్తూరి న‌భా న‌టేష్ (Nabha Natesh). అందం, అభిన‌యం అన్నీ ఉన్నా ఆ రేంజ్‌లో ఛాన్సులు ద‌క్కించుకోలేక నంబ‌ర్ గేమ్‌లో ఎప్పుడూ వెనుక బ‌డే ఉంటోంది. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇమేజ్‌ని మెంటైన్ చేసుకుంటోంది.

Nabha Natesh

రెండేండ్లుగా గేర్ మార్చి త‌రుచూ ఓళ్లు దాచుకోకుండా ఫొటషూట్లు చేస్తున్న‌ప్ప‌టికీ అవ‌కాశాలు ఇచ్చే వారే క‌రువయ్యారు. మాతృభాష క‌న్న‌డ‌ను కాద‌ని తెలుగు మీద మాత్ర‌మే పూర్తి దృష్టి పెట్టిన ఈ ముద్దుగుమ్మ అశ‌ల‌న్నీ అడియాశ‌లైతే అవుతున్నాయి. గ‌త సంవ‌త్స‌రం ప్రియ‌ద‌ర్శి హీరోగా వ‌చ్చిన డార్లింగ్ సినిమాతో అల‌రించిన ఈ చిన్న‌ది మ‌ర‌లా ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినిమాలోనూ క‌నిపించ‌లేదు.

Nabha Natesh

ప్ర‌స్తుతం నిఖిల్ స్వ‌యంభూ చిత్రం మాత్ర‌మే చేతిలో ఉంది. ఇదిలాఉంటే.. తాజాగా ఇత‌ర హీరోయిన్లు త‌రుచూ చేసే ఫొటోషూట్ల‌లా కాకుండా కాస్త రూట్ మార్చి ఓ డిఫ‌రెంట్ స్టైల్‌లో, ఓ కొత్త‌ కాన్సెప్ట్‌తో ఫొటో షూట్ చేసి ఔరా అనిపించింది.

Nabha Natesh

ఓ కార్ల మెకానిక్‌ షోరూంలో కారును రిపేర్ చేస్తున్న‌ట్లుగా ఒంటిపై ఆయిల్ పూసుకుని ఫొటోల‌కు డ‌స్కీ లుక్‌లో ఫోజులిచ్చింది.

Nabha Natesh

ఆ పోటోల‌ను చూసిన వారంతా ఇలా కూడా ఫొటోషూట్లు చేయ‌వ‌చ్చా అని అనుకునేలా చేసింది. దీంతో చాలామంది నెటిజ‌న్లు ఆ పాప‌కు ఎవ‌డ్రా అయిల్ పూసిందంటూ ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Nabha Natesh

Updated Date - Aug 20 , 2025 | 06:02 AM