Don Bosko: లెక్చరర్ సుమతిగా మిర్నా మీనన్

ABN , Publish Date - May 16 , 2025 | 06:49 PM

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ బావమరిది రుష్య 'డాన్ బాస్కో' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో లెక్చరర్ పాత్రను మిర్నా మీనన్ పోషిస్తోంది.

ప్రముఖ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బావమరిది విరాట్ కర్ణ (Virat Karna) హీరోగా 'పెదకాపు -1' చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. అలానే ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ 'నాగబంధం' (Nagabandham) లో నటిస్తున్నాడు. అలానే ఇప్పుడు మరో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi) బావమరిది రుష్య (Rushya) సైతం హీరోగా 'డాన్ బాస్కో' (Don Bosko) మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తాజా మూవీ సెట్స్ పైకి వెళ్ళింది.


_ANI8941 (1).JPGవినోదమే ప్రధానంగా తెరకెక్కుతున్న 'డాన్ బాస్కో' మూవీలో మలయాళీ నటి మిర్నా మీనన్ (Mirnaa Menon) కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే తెలుగులో ''క్రేజీ ఫెల్లో, ఉగ్రం, నా సామిరంగ'' (Naa Saami Ranga) చిత్రాలలో మిర్నా నటించింది. 'డాన్ బాస్కో' మూవీ ప్రారంభోత్సవంలోనూ మిర్నా పాల్గొంది. క్లాస్ మేట్స్ రీ-యూనియన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మురళీ శర్మ (Murali Sharma) ప్రిన్సిపాల్ గా నటిస్తుండగా, లెక్చరర్ సుమతి పాత్రను మిర్నా మీనన్ చేస్తోంది. ఇతర ప్రధాన పాత్రలను మౌనిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, విష్ణు ఓయ్ చేస్తున్నారు. శంకర్ గౌరి రచన చేసి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శైలేష్‌ రమ (Sailesh Rama) నిర్మిస్తున్నారు. మార్క్ కె రాబిన్ (Mark K Robin) ఈ మూవీకి సంగీతం సమకూర్చుతున్నాడు.

Updated Date - May 16 , 2025 | 06:58 PM