Meenaakshi Chaudhary: పేరు మార్చుకున్న.. మీనాక్షి చౌదరి!
ABN , Publish Date - Jun 29 , 2025 | 12:18 PM
వరుస సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పొడుగు కాళ్ల సుందరి మీనాక్షి చౌదరి తెలుగు నాట దూసుకు పోతుంది.
గత సంవత్సరం లక్కీ భాస్కర్, ఈ యేడు సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పొడుగు కాళ్ల సుందరి మీనాక్షి చౌదరి (MEENAAKSHI CHAUDHARY) తమిళ, తెలుగు చిత్రపరిశ్రమల్లో శ్రేణి హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుని తీరిక లేకుండా దూసుకుపోతుంది. తమిళంతో ఒకటి రెండు చిత్రాలతోనే సరి పెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో వరుస అవకాశాలతో బిజీగా ఉంటోంది.
అయితే ఈ అమ్మడు తన అదృష్టాన్ని మరింతగా పెంచుకునేందుకు తన పేరులో సంఖ్యాశాస్త్రాన్ని నమ్ముకుంటూ చిన్నమార్పులు చేసుకుంది. తన పేరులోని "MEENAKSHI CHAUDHARY బదులుగా ఇపుడు ఒక 'ఏ' అక్షరాన్ని నేర్చి. "MEENAAKSHI CHAUDHARY' మార్చుకుంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ఇదిలాఉంటే.. మీనాక్షి చౌదరి తాజాగా నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) తో 'అనగనగా ఒక రాజు, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు (karthik Varma Dandu) దర్శకత్వంలో నాగ చైతన్య (Naga Chaitanya) సరసన ఓ సినిమా చేయబోతుంది. ఇవే గాక మరో నాలుగు ఇంట్రెస్టింగ్ చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. తాజాగా పేరు మార్పుతో తన అదృష్టం మరింతగా రెట్టింపు అవుతుందని, అవకాశాలు మరిన్ని తలపులు తడుతాయనే ఆశతో ఉంది.