Madhavi Latha: సమంత రెండో పెళ్లి.. సతి సావిత్రి, రాముడిలా వేషాలు దొబ్బకండి

ABN , Publish Date - Dec 10 , 2025 | 02:19 PM

నచ్చావులే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది నటి మాధవీ లత (Madhavi Latha), ఎంతో అమాయకమైన ముఖంతో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది.

Madhavi Latha

Madhavi Latha: నచ్చావులే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది నటి మాధవీ లత (Madhavi Latha), ఎంతో అమాయకమైన ముఖంతో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఆమె ఆ తరువాత నానితో స్నేహితుడా సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఆ తరువాత అడపాదడపా సినిమాలు చేసినా.. అవేమి అమ్మడికి గుర్తింపును తీసుకురాలేకపోయాయి. ఇక సినిమాలు పక్కన పెట్టి బీజేపీలో చేరి ఎన్నికల్లో నిలబడింది. అక్కడ కూడా విజయం దక్కకపోవడంతో ప్రస్తుతం మాధవీ లత సోషల్ మీడియాకు అంకితమయ్యింది.

బెంగుళూరులో ఉద్యోగం చేసుకుంటూ.. సోషల్ మీడియాలో ఏ టాపిక్ ట్రెండ్ అయినా కూడా దానిపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా మాధవీ లత.. సమంత రెండో పెళ్లిపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. అక్కినేని నాగ చైతన్యతో విడిపోయాక.. కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న సామ్.. ఈ నెలలోనే డైరెక్టర్ రాజ్ నిడిమోరును రెండో వివాహాం చేసుకుంది. ఆమె పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. చాలామంది సామ్ పై విమర్శలు గుప్పించారు.

ఇక ఆ ట్రోలర్స్ గురించి మాధవీ లత మాట్లాడుతూ.. ' సమంత రెండో పెళ్లి చేసుకుంటే ఎవరెవరో ఏడుస్తున్నారు. వీళ్ళకెంటో బాధ మరి. వీళ్ళెవ్వరూ ఎవరి సంసారాలను కూల్చలేదు అన్నట్టు. ఆమె సంసారాన్ని కూల్చింది వీళ్లు చూశారు మరి. ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్ళు.. మీక్కూడా చాలా రిలేషన్స్ ఉండి ఇంకొక సంసారం కూల్చి వారిని పెళ్లి చేసుకోవాలనుకున్నారుగా. ఓ.. వాడు తెలివిగా తప్పించుకున్నాడు. వాడి పెళ్ళానికి విడాకులు ఇవ్వకుండా.. మిమ్మల్ని పెళ్లి చేసుకోకుండా.. సో, మీ జీవితంలో అది జరగలేదు కాబట్టి ఇంకొకరి జీవితంలో అలా జరిగిందని ఊహించుకుంటూ కామెంట్స్ చేస్తారు.

ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి. ఎవరికి ఎప్పుడు రాసి ఉంటే అప్పుడు కలిసి ఉంటారు. ఎవరికి రుణాలు తీరిపోతే వాళ్లు విడిపోతారు. ఒకరిని ఒకరు చంపుకోవడం లేదు కదా.. సంతోషించండి. మీరేమి అంత పత్తితులు కాదు.. మీ గురించి నాకు తెలుసు' అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఏడ్చే సమాజం ఎలాగూ ఏడుస్తది.పెళ్లి చేసుకుంటే విష్ చేసే రోజులు పోయి పడి ఏడ్చే రోజులు వచ్చాయి. మీరు ఎదో సతి సావిత్రి.. మహా పురుషులు రాముడు అయినట్లు వేషాలు దొబ్బకండి' అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Updated Date - Dec 10 , 2025 | 02:35 PM