Haripriya: హరిప్రియ తల్లయింది.. విశేషం ఏంటంటే..

ABN, Publish Date - Jan 27 , 2025 | 08:33 AM

కన్నడ భామ, పిల్ల జమిందార్‌ ఫేం హరిప్రియ అమ్మగా ప్రమోషన్‌ పొందింది. ఆదివారం ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.. ఈ వార్తను హరిప్రియ భర్త వశిష్ట సింహ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.


కన్నడ భామ, పిల్ల జమిందార్‌ (Pilla Zamindar)ఫేం హరిప్రియ (haripriya)అమ్మగా ప్రమోషన్‌ పొందింది. ఆదివారం ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.. ఈ వార్తను హరిప్రియ భర్త వశిష్ట సింహ (Vasista simha) ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘బెంగుళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో హరిప్రియ మొదటి బిడ్డకు (Baby boy) జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఇక మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది’ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు వశిష్ట సింహా. దీంతో తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందిన హరిప్రియ- వశిష్ట దంపతులకు కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.



అయితే ఇక్కడ ఇంకో విశేషం ఉంది. హరిప్రియ, వశిష్ఠ సింహా పెళ్లి రోజునే వారు అమ్మానాన్నలయ్యారు. ఈ జంట 2023 జనవరి 26న వివాహం చేసుకున్నారు. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత, అంటే జనవరి 26, 2025న పండంటి మగ బిడ్డ వారి జీవితంలోకి అడుగు పెట్టాడు. ‘దీంతో మా పెళ్లి రోజునే వచ్చాడు’ అని వశిష్ఠ సింహ పోస్ట్‌ చేశాడు. హరిప్రియ, వశిష్ఠ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉంటున్నారు. అయితే పెళ్లి తర్వాత హరిప్రియ తన కుటుంబానికి ఎక్కువ సమయం ఇచ్చింది. గర్భం దాల్చగానే సినిమా షూటింగులకు దూరం అయ్యింది.

హరిప్రియ కన్నడలోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో నాని పిల్ల జమీందార్‌తోపాటు వరుణ్‌ సందేశ్‌తో కలిసి అబ్బాయి క్లాస్‌- అమ్మాయి మాస్‌, ఈ వర్షం సాక్షిగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. బాలకృష్ణతో కలిసి జై సింహా సినిమాలో స్ర్కీన్‌ షేర్‌ చేసుకుంది. ఈ చిత్రం తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో నటించలేదు. 

Updated Date - Jan 27 , 2025 | 08:41 AM