Hansika:పేరు మార్చుకున్న హన్షిక.. ఇప్పుడైనా కలిసొచ్చేనా
ABN , Publish Date - Oct 23 , 2025 | 08:20 AM
హీరోయిన్ హన్సికా మొత్వాని (Hansika Motwani)కి కష్టాలు వెంటాడుతున్నాయి. దీంతో తన పేరును సంఖ్యా శాస్త్రం ప్రకారం మార్చుకున్నారు.
హీరోయిన్ హన్సికా మొత్వాని (Hansika Motwani)కి కష్టాలు వెంటాడుతున్నాయి. దీంతో తన పేరును సంఖ్యా శాస్త్రం ప్రకారం మార్చుకున్నారు. అంటే తన పేరులోని ఆంగ్ల అక్షరాల్లో అదనంగా మరో 'ఎన్' చేర్చుకున్నారు. ఒకపుడు కోలీవుడ్ లో చిన్న ఖుష్బూగా అభిమానులు పిలుచుకునే హన్సికాకు గత కొన్నేళ్ళుగా బ్యాడ్ టైమ్ కొనసాగుతోంది.

ఆమె నటించిన పలు తమిళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో ఆమెకు కోలీవుడ్ లో అవకాశాలు సన్నగిల్లాయి. అదే సమయంలో తన స్నేహితుడిని వివాహం చేసుకుని చివరకు విడాకులు కూడా తీసుకున్నారు. దీనికితోడు కుటుంబ సమస్యలు కూడా చుట్టుముట్టాయి.

ఈ నేపథ్యంలో జ్యోతిష్యం, దైవచింతన, పరిహారపూజలపై అధిక శ్రద్ద చూపిస్తున్నారు. అలాగే, తన పేరులో సంఖ్యా శాస్త్రం ప్రకారం అదనంగా మరో 'ఎన్' చేర్చారు. తద్వారా తన కష్టాలు తీరి తలరాత (ఫేట్) మారుతుందని ఆమె బలంగా నమ్ముతున్నారు. కాగా, ఆమె తన పేరు మార్చుకోవడం ఇది రెండోసారి. గతంలో హన్సికా అనే పేరుతో నటించిన ఆమె ఆ తర్వాత హన్సికా మొత్వానీగా మార్చుకున్నారు. ఇపుడు హన్సికా ఆంగ్ల అక్షరాల్లో అదనంగా 'ఎన్' అనే అక్షరాన్ని చేర్చుకున్నారు.