Karmastalam: నెవ‌ర్ భిఫోర్ అవ‌తార్‌లో.. దివి!

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:05 PM

సామ్రాద్ని ఫిల్మ్స్, రాయ్ ఫిల్మ్స్ బ్యానర్లపై హర్ష వర్దన్ షిండే నిర్మిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘కర్మస్థలం’

Karmastalam

సామ్రాద్ని ఫిల్మ్స్, రాయ్ ఫిల్మ్స్ బ్యానర్లపై హర్షవర్దన్ షిండే నిర్మిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘కర్మస్థలం’ (Karmastalam). రాకీ షెర్మాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అర్చనా శాస్త్రి (Archana Shastry), చుంకీ పాండే, అరవింద్ కృష్ణ, ప్రిన్స్ సెసిల్, దివి వద్త్యా (Divi), కిల్లి క్రాంతి, మిథాలి చౌహాన్ (Mitali Chauhan), కాలకేయ ప్రభాకర్, వెంకటేష్ ముమ్మిడి, వినోద్ అల్వా, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో కీ రోల్‌ చేస్తున్న బిగ్ బాస్ ఫేమ్ దివి వద్త్యా పై రూపొందించిన పోస్టర్ ను విడుద‌ల చేయ‌గా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా పోస్ట‌ర్‌లో దివిని శక్తివంతమైన యోధురాలిగా చూపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అగ్ని కణాలు ఎగిసిపడుతున్న యుద్ధ వాతావరణంలో దివి ముందుకు దూసుకుపోతున్న తీరు పోస్టర్‌కి మరింత ఇంపాక్ట్ ఇచ్చింది.

divi

విజువల్ వండ‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీకి శిరీష్ ప్రసాద్ ఎడిటర్‌గా, సాయి కార్తీక్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు టీమ్ తెలిపింది.

Updated Date - Dec 11 , 2025 | 01:01 PM