Dimple Hayathi: మరోసారి వివాదంలో.. డింపుల్ హయతి ! యువతులకు వేదింపులు
ABN , Publish Date - Sep 30 , 2025 | 06:58 PM
హీరోయిన్ డింపుల్ హయాతి మరోసారి వివాదంలో చిక్కుకుంది. సినిమాల కంటే వివాదాలు, గ్లామర్ షూట్స్‌తో ఎక్కువ ఫేమస్ అవుతున్న డింపుల్, ఒడిశా యువతులను వేధించిందన్న ఆరోపణలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
సినిమాల కన్నా తరుచూ హాట్ హాట్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో కాక రేపే అచ్చ తెలుగు కథానాయిక డింపుల్ హయతి (Dimple Hayathi) తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. చేసే చిత్రాల కన్నా బయటి వివాదాలతోనే మీడియాలో హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఆ మధ్య తన అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ విషయంలో ఏకంగా డీసీపీ రాహుల్ హెగ్డేతో గొడవపడి కేసులు ఎదుర్కొన్న డింపుల్ ఇప్పుడు కొత్తగా మరో వివాదంలో చిక్కుకుంది.
విషయానికి వస్తే.. ఇటీవల డింపుల్ హయాతి భర్త తమ పెంపుడు కుక్కలను చూసుకోవడానికి ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువతులను పిలిపించుకున్నారని సమాచారం. అయితే వారిని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా బలవంతంగా పనులు చేయించి, తర్వాత ఇంటి నుంచి బయటకు పంపేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. డింపుల్ భర్త వారిని తీవ్రంగా అవమాన పరిచినట్లు చెబుతున్నారు.
మీ ప్రాణం నా చెప్పులకు కూడా సరిపోదు అంటూ దూషించాడని, మా దగ్గర లాయర్లు ఉన్నారు.. మీ వల్ల ఏమీ చేయలేరు” అంటూ బెదిరించాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. జీతం కూడా ఇవ్వకుండా ఇద్దరు యవతులను ఇంట్లో నుండి వెళ్లగొట్టారని.. బాధిత యువతుల పరిస్థితిని వివరిస్తూ వారిని ఇక్కడికి తీసుకు వచ్చిన ఒక మహిళ స్వయంగా వీడియో విడుదల చేయడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆ మధ్య వరకు హెల్త్ ఇష్యూలతో సతమవుతూ ఏడాదికి పైగా సినిమాలకు దూరంగా డింపుల్ తీరా యాక్టివ్ అయి తిరిగి సినిమాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇలా వివాదాల్లో డింపుల్ హయాతి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇంట్లో పని కోసం తీసుకొచ్చిన యువతులను వేధించారన్న ఆరోపణలు నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. ఈ వివాదం ఆమె కెరీర్, ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందా అన్న దానిపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదిలాఉంటే వీడియోలో ఈ ఫిర్యాదు చేసిన మహిళ డింపుల్ భర్త అంటూ ఒకటికి రెండు మార్లు సంబోధించడం ఇప్పుడు ప్రధాన వార్త అయింది. దశాబ్దానికి పైగానే సినిమాలు చేస్తూ వస్తున్న డింపుల్‌కు పెళ్లి అయినట్లు భర్త ఉన్నట్లు ఇంతవరకు చాలామందికి తెలియక పోవడం అందరినీ షాక్ గురి చేసింది. ఇప్పుడు ఈ విషయంలోనే అంతా అయోమయానికి గురవుతుండగా మరికొందరు అతను భర్త కాదు మేనేజర్ ఇతర ఇంకా స్టాప్ గానీ అయిండొచ్చు అంటూ అభిప్రాయ పడుతున్నారు.