Actor Vishal Gets Engaged: విశాల్‌ ధన్సిక నిశ్చితార్థం

ABN , Publish Date - Aug 30 , 2025 | 04:14 AM

కోలీవుడ్‌ హీరో, నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్‌, హీరోయిన్‌ ధన్సికల వివాహ నిశ్చితార్థం శుక్రవారం చెన్నైలో జరిగింది. .;.

కోలీవుడ్‌ హీరో, నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్‌, హీరోయిన్‌ ధన్సికల వివాహ నిశ్చితార్థం శుక్రవారం చెన్నైలో జరిగింది. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే పాల్గొన్నట్టు వెల్లడించిన విశాల్‌.. అందరి అశీస్సులు కావాలని కోరుతూ తమ నిశ్చితార్థ ఫోటోలను ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘ఈ రోజున మా కుటుంబ సభ్యుల సమక్షంలో ధన్సికకు, నాకు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఎంతో సంతోషంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. వివాహ తేదీని త్వరలోనే వెల్లడిస్తాం. ధన్సికతో నిశ్చితార్థం జరిగిన నేపథ్యంలో త్వరలోనే నా బ్యాచిలర్‌ జీవితానికి ముగింపు రానుంది. ఇకపై నా సినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఉండవు’ అని పేర్కొన్నారు.

Updated Date - Aug 30 , 2025 | 04:14 AM