Thiruveer: తండ్రైన.. తిరువీర్! నాయినొచ్చిండు అంటూ.. హీరో ఎమోషనల్
ABN , Publish Date - Dec 12 , 2025 | 10:24 AM
తెలుగు హీరో, ఇటీవల ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో (The Great Pre-Wedding Show) సినిమాతో మంచి విజయం అందుకున్న తిరువీర్ (Thiruveer) తండ్రిగా ప్రమోషన్ పొందాడు.
తెలుగు హీరో, ఇటీవల ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో (The Great Pre-Wedding Show) సినిమాతో మంచి విజయం అందుకున్న తిరువీర్ (Thiruveer) తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఆయన భార్య కల్పనా రావు (Kalpana Rao) శుక్రవారం తెల్లవారుజామున పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇదిలాఉంటే .. 2016లో బొమ్మలరామారం అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తిరువీర్ అనతి కాలంలోనే టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. గతంలో నటించిన మసూధ (Masooda), టక్ జగదీశ్, పరేశాన్ (Pareshan) వంటి సినిమాలతో గుర్తింపు దక్కించుకున్నాడు. ఇటీవల వచ్చిన ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో ఆయన కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ నిలిచింది. 2024లో కల్పనా రావును వివాహం చేసుకున్నాడు.