Seetha Payanam Teaser: తెలుగులో యాక్షన్ కింగ్ డైరెక్షన్.. సీతా పయనం టీజర్ భలే ఉందే!
ABN , Publish Date - May 29 , 2025 | 10:18 AM
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకుడిగా తొలిసారి తెలుగులో దర్శకత్వం వహిస్తూ కూతురు ఐశ్వర్యను హీరోయిన్‌కు టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్న చిత్రం సీతా పయనం
యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun Sarja) దర్శకుడిగా తొలిసారి తెలుగులో దర్శకత్వం వహిస్తూ కూతురు ఐశ్వర్య (Aishwarya )ను హీరోయిన్‌కు టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్న చిత్రం సీతా పయనం (Seetha Payanam). స్వయంగా అర్జున్ నిర్మిస్తూ, కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాతో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సోదరుడి కుమారుడు నిరంజన్ (Niranjan) హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అనూప్ రూబెన్స్ (Anup Rubens) సంగీతం అందించాడు. అర్జున్, ప్రకాశ్ రాజ్, దృవ్ సర్జా (Dhruva Sarja) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఉపేంద్ర ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఇదిలాఉంటే మూడేండ్ల క్రితం ప్రాంభమైన ఈ సినిమాలో మొదటగా విశ్వక్ సేన్ హీరో అయినప్పటికీ విశ్వక్ మధ్యలోనే వదిలేసి రావడంతో కన్నడ నుంచి నిరంజన్‌ను సెలక్ట్ చేశారు. ఇదిలాఉంటే ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. కుటుంబాలు, రిలేషన్స్, లవ్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది.