Saroja Devi: అభినయ సరస్వతి బి.సరోజాదేవి కన్నుమూత

ABN , Publish Date - Jul 14 , 2025 | 10:32 AM

సీనియర్‌ నటి అభినయ సరస్వతి బి.సరోజాదేవి కన్నుమూశారు.

సీనియర్‌ నటి అభినయ సరస్వతి బి.సరోజాదేవి (B Saroja Devi) (87)కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్న ఆమె యశ్వంతపుర మణిపాల్‌ ఆస్పత్రిలో చేరగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జనవరి 7, 1938లో బెంగళూరులో జన్మించారు. తండ్రి బైరప్ప మైసూర్‌లో పోలీస్‌ ఆఫీసర్‌గా పని చేసేవారు. తల్లి గృహిణి. తండ్రి ప్రోద్బలంతో డాన్స్‌ నేరుకున్న ఆమె తదుపరి సినిమాలపై ఆసక్తి చూపారు.

Sarooja-3.jpg

కన్నడ చిత్రం మహాకవి కాళిదాసుతో ఆమె నటిగా తెరంగేట్రం చేశారు. తెలుగులో ‘పాండురంగ మహత్యం’ తొలి చిత్రం. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎంజీఆర్‌ల వంటి దిగ్గజ నటులతో పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించారు.   తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో అభిమానులను సొంతం చేసుకొన్నారు. ‘అభినయ సరస్వతి’ బిరుదాంకితురాలయ్యారు.


తెలుగులో ‘మహాకవి కాళిదాసు’, 'భూకైలాస్‌', 'పెళ్లి కానుక', 'పెళ్లి సందడి', 'ఇంటికి దీపం ఇల్లాలే', 'జగదేకవీరుని కథ', 'శ్రీ సీతారామ కల్యాణం', 'దాగుడు మూతలు', 'ఆత్మబలం', 'అమరశిల్పి' జక్కన, శకుంతల, ఉమా చండీ గౌరీశంకరుల కథ, శ్రీ రామాంజనేయ యుద్ధం, సీతారామ వనవాసం, దానవీర శూరకర్ణ వంటి ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించారు. 1955 నుంచి 1984 మధ్య 29 ఏళ్ల పాటు వరుసగా 160కి పైగా  సినిమాల్లో లీడ్‌రోల్‌లో నటించిన ఏకైక నటిగా సరోజా దేవి చరిత్ర సృష్టించారు.  

saroja.jpg

తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం 'దేవి అభయం'. కన్నడలో నటసౌర్వభౌమా (2019) చిత్రంలో గెస్ట్ రోల్ చేసారు. అదే ఆవిడా నటించిన చివరి చిత్రం. సినిమా రంగానికి ఆమె చేసిన సేవలకు గాను ప్రభుత్వం ఆమెను 1969లో పద్మశ్రీతో, 1992లో పద్మభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది.పలు స్టేట్  అందుకున్నారు. 

saroja.jpg

Updated Date - Jul 14 , 2025 | 05:06 PM