Sitaare Zameen Par: తెలుగులోనూ.. అమీర్ ఖాన్ సినిమా! ట్రైలర్ చూశారా
ABN , Publish Date - Jun 12 , 2025 | 06:58 PM
అమీర్‌ఖాన్ న టించిన నూతన బాలీవుడ్ చిత్రం సితారే జమీన్ ఫర్ తెలుగు ట్రైలర్ విడుదలైంది.
అమీర్‌ఖాన్ (Aamir Khan) దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించగా 2007లో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం తారే జమీన్ ఫర్ (Taare Zameen Par). ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందించిన సినిమా సితారే జమీన్ ఫర్ (Sitaare Zameen Par). 2018లో స్పానిష్ ఛాంపియన్స్ (Champions) మూవీ ఆధారంగా హిందీలో రూపొందించిన ఈ సినిమాకు దివ్య నిధి శర్మ (Divy Nidhi Sharma) కథ అందించగా R. S. ప్రసన్న (R. S. Prasanna) దర్శకత్వం వహించాడు. అమీర్ ఖాన్ స్వయంగా నిర్మించాడు. జెనీలియా దేశ్‌ముఖ్ కీలక పాత్ర పోషించింది. జూన్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ సినిమాపై నెమ్మదిగా అంచనాలను పెంచుతుండగా షూర్ షాట్ హిట్ అనే టాక్ పబ్లిక్ నుంచి బాగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రైలర్‌లోనే సుమారు కథ అతా చెప్పేశారు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ బాస్కెట్ బాల్ కోచ్‌గా నటించాడు. తాగిన మత్తులో పోలీస్ వాహానాన్ని ఢీ కొట్టడంతో అతనిపై కేసు నమోదు చేస్తారు. కోర్టు మూడు నెలల పాటు మానసిక పరిపక్వత లేని వారికి బాస్కెట్ బాల్‌లో శిక్షణ ఇవ్వాలని తీర్పునిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ కోచ్ వారికి ఎలా తర్ఫీదు ఇచ్చాడు, ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, వాటిని ఎలా అధిగమించాడు చివకు కప్పు గెలిచారా లేదా అనే ఆసక్తికరమైన కథకథనాలతో మూవీ ఎమోషనల్, కామెడీగా సితారే జమీన్ ఫర్ (Sitaare Zameen Par) సినిమా ఉండనుంది.