A22xA6: అల్లు అర్జున్, అట్లీ సినిమా... ఐదుగురు కథానాయికలు...
ABN , Publish Date - May 23 , 2025 | 06:46 AM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సెన్సేషనల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబోలో ఓ సెన్సేషనల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబో కోసం భారతదేశ సినీ ప్రేమికులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అల్లు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో తెలుగింటి అల్లుడు అట్లీ ఫస్ట్ టైమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ (Kalanithi Maran) నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి విడుదల చేసిన ఎనౌన్స్‌మెంట్ వీడియో ఇప్పటికీ సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా హీరో అల్లు అర్జున్, హాలీవుడ్ టెక్నిషియన్స్, డైరెక్టర్ అట్లీపై చిత్రీకరించిన ఈ ప్రత్యేక వీడియో అందరిని సంభ్రమశ్చర్యాల్లో ముంచింది.
ఇదిలా ఉంటే.. కొన్ని రోజులుగా ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వీంగ్‌లో సాగుతున్నాయి. ఇందుకోసం ఇటీవల హైదరాబాద్ వచ్చిన అట్లీ (Atlee) అర్జున్ (Allu Arjun)ను కలిసి ఈ చిత్రంకి సంబంధించిన చర్చల్లో పాల్గొన్నారు. జూన్‌లో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్ A22 x A6 గా పిలవబడుతున్న ఈ చిత్రం, భారతీయ విలువలతో కూడిన కథనంతో ఓ భారీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో కథానాయుకల విషయంలో ఓ ఆసక్తికర వార్త నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో ఐదుగురు కథానాయికలకు ప్రాధాన్యం ఉందని, ఇప్పటికే వారితో చర్చలు ముగిసి వారిని సెలక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారిలో ఇప్పటికే దీపికా పదుకుణే (Deepika Padukone), మృణాల్ ఠాగూర్ (Mrunal Thakur), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) లు సెలక్ట్ అయ్యారని, ఇంకా లేటెస్ట్ టాలీవుడ్ సెన్షేషన్ భాగ్య శ్రీ భోర్సే (Bhagyashri Borse)తో చర్చలు జరుగుతున్నాయని, ఇక మరొక నాయిక కోసం సెర్చింగ్ జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇదంతా చూస్తున్న నెటిజన్లు అట్లీ అసలు ఏం కుక్ చేస్తున్నావయ్యా ఊహలకు అందడం లేదు.. మైండ్ దొబ్బుతుందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమది ఎంతమందినైనా పెట్టుకోండి గానీ రెగ్యులర్‌గా అప్డేట్స్ మాత్రం ఇవ్వండి చాలు అంటున్నారు.
అయితే ఇంతవరకు ఈ వార్తలపై సదరు నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకున్నాసోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుండడం గమనార్హం. మేకర్స్ స్వయంగా ప్రకటిస్తే తప్పా ఈ వార్తలపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.