Chowkidar: సాయి కుమార్ ‘చౌకీదార్’ నుంచి.. గుండెను కదిలించే ‘నాన్న’ పాట

ABN , Publish Date - Jun 01 , 2025 | 09:42 PM

పృథ్వీ అంబర్, ధన్యా రమ్యకుమార్ జంటగా తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందుతున్న చిత్రం ‘చౌకీదార్’.

nanna

డైలాగ్ కింగ్ సాయి కుమార్ (Sai Kumar) ప్రస్తుతం ఏ చిత్రంలో నటిస్తే ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఆయన నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్‌ హిట్లుగా నిలిచాయి. ఇక ఆయన నటించిన కమిటీ కుర్రోళ్లు, లక్కీ భాస్కర్, సరిపోదా శనివారం, మెర్సీ కిల్లింగ్ వంటి చిత్రాలకు గద్దర్ అవార్డులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి సాయి కుమార్ ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో ‘చౌకీదార్’ అనే సినిమాను చేస్తున్నారు.

పృథ్వీ అంబర్ (Pruthvi Ambaar), ధన్యా రమ్యకుమార్ (Dhanya Ramkumar) జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘చౌకీదార్’ మూవీని వీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డా. కల్లహల్లి చంద్ర శేఖర్ నిర్మిస్తుండగా.. చంద్రశేఖర్ బండియప్ప తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో తెరకెక్కిస్తున్నారు.

GsVeG9ZaMAA8_v2.jpg

తాజాగా ఈ చిత్రం నుంచి చౌకీదారు అంటూ సాగే ఓ ఎమోషనల్ (Naanna Anthem) సాంగ్‌ను రిలీజ్ చేశారు. నాన్నా అంటూ సాగుతూ నాన్న గొప్పదనం చాటి చెప్పేలా గుండెను పిండేసేలా సాగే ఈ పాటను సంతోష్ వెంకీ రచించగా.. విజయ్ ప్రకాష్ ఆలపించారు. సచిన్ బస్రూర్ అందించిన బాణీ ప్రతీ ఒక్కరినీ కదిలించేలా ఉంది.

తండ్రి త్యాగాల్ని, మోసే బాధ్యతల్ని, చూపించే ప్రేమను చాటేలా ఈ పాట ఉండ‌డం విశేషం. ఇక లిరికల్ వీడియో చూస్తుంటే సాయి కుమార్ తండ్రిగా మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నారు. పృథ్వీ అంబర్, సాయి కుమార్ మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ఉండేట్టుగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Updated Date - Jun 01 , 2025 | 09:42 PM