Ibomma Ravi: ఇమ్మడి రవి జీవితంపై సినిమా.. ఎవరు నటిస్తున్నారు..
ABN , Publish Date - Nov 19 , 2025 | 06:32 PM
దేశంలో ఏది కొంచెం ట్రెండ్ అయినా దానిపై సినిమాలు రావడం చూస్తూనే ఉన్నాం. బాంబ్ బ్లాస్ట్ అయినా.. టెర్రరిస్ట్ అరెస్ట్ అయినా.. యుద్ధంలో సైనికుడు మరణించినా.. వివాదాల్లో ఒక సెలబ్రిటీ ఇరుకున్నా.. వారి గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తారు.
Ibomma Ravi: దేశంలో ఏది కొంచెం ట్రెండ్ అయినా దానిపై సినిమాలు రావడం చూస్తూనే ఉన్నాం. బాంబ్ బ్లాస్ట్ అయినా.. టెర్రరిస్ట్ అరెస్ట్ అయినా.. యుద్ధంలో సైనికుడు మరణించినా.. వివాదాల్లో ఒక సెలబ్రిటీ ఇరుకున్నా.. వారి గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఆ ఆసక్తినే మేకర్స్ క్యాష్ చేసుకుంటున్నారు. గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విషయం ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అవ్వడం. పైరసీతో ఇండస్ట్రీని భయపెట్టిన ఇమ్మడి రవి (Immadi Ravi) అరెస్ట్ అవ్వడంతో మంచిరోజులు వచ్చాయని సినీ పెద్దలు చెప్పుకొస్తున్నారు.
ఇక ఇంకోపక్క ఇమ్మడి రవి తమకు దేవుడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా రేట్లు పెంచడంతోనే చాలామంది ఐబొమ్మకు ఎడిక్ట్ అయ్యారని, అతనిని అలా మార్చింది ఇండస్ట్రీనే అని చెప్పుకొస్తున్నారు. ఇంకోపక్క అతని జీవితంలో జరిగిన అవమానాలు, భార్య, అత్తా పెట్టిన టార్చర్ కూడా ఎంతోమందిని ఎమోషనల్ అయ్యేలా చేసింది.
ఇవన్నీ విన్న తరువాత ఇమ్మడి రవి జీవితం సినిమాకు ఏమి తక్కువ కాదు అని, అతని బయోపిక్ రేపో మాపో వస్తుంది అని మాట్లాడుకున్నారు. అనుకున్నట్లుగానే ఇమ్మడి రవి బయోపిక్ మేము తీస్తున్నామని ఒక బ్యానర్ ముందుకు వచ్చింది. తేజ్ క్రియేటివ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థ తాజాగా ఐ బొమ్మ రవి జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో రవి జీవితంలో జరిగిన పెద్ద పెద్ద విషయాలు అన్ని ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో ఇమ్మడి రవిగా ఎవరు నటిస్తారు.. ? డైరెక్టర్ ఎవరు అనేది త్వరలోనే చెప్తామని తెలిపారు. మరి ఇమ్మడి రవిగా ఎవరు నటిస్తారో చూడాలి.