Aadi Saikumar: 'శంబాల' నుండి.. ఎమోషనల్ సాంగ్

ABN , Publish Date - Dec 20 , 2025 | 05:13 PM

ఆది సాయికుమార్ నటించిన తాజా చిత్రం 'శంబాల'. డిసెంబర్ 25న విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి 'పదే పదే' గీతాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు.

Shambhala Movie

వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) హీరోగా రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’ (Shambhala). యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ మూవీని డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆడియెన్స్‌ను మెప్పించాయి.


తాజాగా ‘శంబాల’ కథను కాస్త రివీల్ చేసేలా, హీరో ఫ్యామిలీ గురించి, ఆ ఫ్యామిలీకి వచ్చిన కష్టం గురించి చెప్పె ‘పదే పదే’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను గమనిస్తే సినిమాలో హీరో ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి హీరో ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటో ‘ముగ్గురైనా ఒక్కటేగా’ అంటూ పాటలో చేర్చిన పదాన్ని గమనిస్తే అర్థం అవుతుంది. ఇక ఈ పాట వింటుంటే కళ్లలో నీళ్ళు చిప్పిల్లేలా ఉంది. ఎమోషనల్‌గా సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో అందరి హృదయాల్ని హత్తుకుంటోంది. ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ (Kittu Vissupragada) సాహిత్యం, యామిని ఘంటసాల గాత్రం, శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala) బాణీ చక్కగా కుదిరాయి. ఈ సినిమా రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్స్ ను అందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Dec 20 , 2025 | 07:11 PM