స్వచ్ఛమైన ప్రేమకథ

ABN , Publish Date - Jun 16 , 2025 | 04:36 AM

‘మను’ ఫేమ్‌ ఫణీంద్ర నార్సెట్టి తెరకెక్కించిన చిత్రం ‘8 వసంతాలు’. ‘మ్యాడ్‌’ ఫేమ్‌ అనంతిక సునీల్‌కుమార్‌ కీలక పాత్రలో నటించారు. రవితేజ దుగ్గిరాల, హనురెడ్డి కీలక పాత్రలు...

‘మను’ ఫేమ్‌ ఫణీంద్ర నార్సెట్టి తెరకెక్కించిన చిత్రం ‘8 వసంతాలు’. ‘మ్యాడ్‌’ ఫేమ్‌ అనంతిక సునీల్‌కుమార్‌ కీలక పాత్రలో నటించారు. రవితేజ దుగ్గిరాల, హనురెడ్డి కీలక పాత్రలు పోషించారు. నవీన్‌ యెర్నేని, యలమంచలి రవిశంకర్‌ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు ఆకట్టుకున్నాయి. ఈ నెల 20న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం మేకర్స్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ప్రేమంటే ఒక దశ మాత్రమే.. దిశ కాదు’, ‘మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌధాలు, భాగ్యనగరాలు ఉన్నాయి.. ఆడదాని ప్రేమకు ఏమున్నాయి? మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప’ వంటి సంభాషణలు సినిమాపై మరింత అంచనాలను పెంచాయి. ప్రధాన పాత్రధారుల నటన, అద్భుతమైన విజువల్స్‌, సంగీతం ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మేకర్స్‌ మాట్లాడుతూ ‘‘ఇది మహిళా ప్రాధాన్యం ఉన్న కథ అయినా, ఇందులోని పాత్రలన్నీ కీలకమే. ప్రతీ పాత్రలో చాలా లేయర్స్‌ ఉంటాయి.


ఇదో స్వచ్ఛమైన ప్రేమ కథ. నిజజీవితాన్ని తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది. అద్భుతమైన సినిమాటిక్‌ అనుభవాన్ని పంచుతుంది’’ అని తెలిపారు.

Updated Date - Jun 16 , 2025 | 04:36 AM