8 Vasantalu Teaser: 8 వసంతాలు నుంచి సెకండ్ టీజర్ రిలీజ్

ABN , Publish Date - Jun 07 , 2025 | 05:17 PM

మ్యాడ్(Mad) సినిమాతో  ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ అనంతిక సానిల్ కుమార్(Ananthika Sanilkumar).

8 Vasantalu

8 Vasantalu Teaser:  మ్యాడ్(Mad) సినిమాతో  ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ అనంతిక సానిల్ కుమార్(Ananthika Sanilkumar). మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న అనంతిక తాజాగా 8 వసంతాలు(8 Vasantalu) అనే సినిమాలో నటిస్తుంది.  ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం( Phanindra Narsetti) వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.  లేడీ ఓరియెంటెడ్ సినిమాగా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ దుగ్గిరాల హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, మొదటి టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

 

 తాజాగా 8 వసంతాలు సినిమా నుంచి సెకండ్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మొదటి టీజర్ లో హీరోయిన్ పడే మానసిక వ్యధను చూపించిన డైరెక్టర్.. ఈ టీజర్ లో ఆమె ఆనందాన్ని చూపించాడు. ఇక ఇందులో హీరో పాత్రను వివరించారు. అతని పేరు సంజయ్. అతనొక రచయిత. మొదటిసారి రోడ్డు మీద అతడిని చూసిన హీరోయిన్ ప్రేమలో పడిపోతుంది. అతడి గురించి వివరాలు తెలుసుకుంటుంది. ఆ తరువాత సంజయ్ ప్రేమలో పడుతుంది అన్నట్లు ఈ టీజర్ లో చూపించారు.   

 

 ఇక టీజర్ లో ఉన్న  ప్రతి డైలాగ్ చాలా లోతుగా ఆలోచించేలా ఉన్నాయి. "అమ్మాయిలకు కత్తి పట్టుకొని రౌద్ర రసం కక్కేవాడికంటే..  కన్నీళ్లు తుడుస్తూ కరుణరసం చూపించేవాడంటేనే ఇష్టం",   "ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు.. చేయాల్సిన ప్రయాణం" డైలాగ్స హైలైట్ గా నిలిచాయి. ఇక సినిమాకు మెయిన్ హైలైట్ అంటే మ్యూజిక్.  ఖుషీ, హాయ్ నాన్న, మనమే లాంటి సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించి ప్రేక్షకులను అలరించిన హేశం అబ్దుల్ వహాబ్ మరోసారి తన స్టైల్లో  అద్భుతం చేశాడనిపిస్తుంది. విజువల్స్,  టేకింగ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 8 వసంతాలు  సినిమా  జూన్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అనంతిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

Updated Date - Jun 07 , 2025 | 05:18 PM