71st National Film Awards 2025: 71వ జాతీయ అవార్డుల పూర్తి లిస్ట్ ఇదే..

ABN , Publish Date - Aug 01 , 2025 | 08:06 PM

భారతీయ సినిమాకు 2023వ సంవత్సరం ఎంతో ఊరట నిచ్చింది. ఆ యేడాది విడుదలైన పలు భాషా చిత్రాలు విజయం సాధించాయి.

71st National Film Awards

71వ జాతీయ అవార్డులు

తెలుగు సినిమాకు ఏడు అవార్డులు

ఉత్తమ తెలుగు చిత్రంగా 'భగవంత్ కేసరి'

'బేబీ', 'హను-మ్యాన్' చిత్రాలకు రెండేసి అవార్డులు

'బలగం'తో గీతరచయిత కాసర్ల శ్యామ్ కు జాతీయ అవార్డు

'గాంధీ తాత చెట్టు'తో ఉత్తమ బాలనటిగా సుకృతివేణి

భారతీయ సినిమాకు 2023వ సంవత్సరం ఎంతో ఊరట నిచ్చింది. ఆ యేడాది విడుదలైన పలు భాషా చిత్రాలు విజయం సాధించాయి. 2023లో విడుదలైన పలు చిత్రాలు 71వ జాతీయ చలన చిత్ర అవార్డులకు పోటీపడ్డాయి. తెలుగు సినిమాకు ఏడు అవార్డులు దక్కాయి. అందులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'భగవంత్ కేసరి' నిలవగా, 'హను-మ్యాన్' రెండింటిని, 'బేబీ' కూడా రెండు అవార్డులను సొంతం చేసుకున్నాయి. 'బలగం' ఓ అవార్డును, 'గాంధీతాత చెట్టు' ఓ అవార్డును దక్కించుకున్నాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా 'ట్వల్త్ ఫెయిల్' ఎన్నికయింది. ఉత్తమ నటుడు విభాగంలో 'జవాన్' ద్వారా షారుఖ్ ఖాన్, 'ట్వల్త్ ఫెయిల్' తో విక్రాంత్ మస్సే విజేతలుగా నిలిచారు. ఉత్తమ నటిగా 'మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే'లో నటించిన రాణీ ముఖర్జీ ఎన్నికయ్యారు.

అవార్డుల వివరాలు:

ఉత్తమ జాతీయ చిత్రం : ట్వల్త్ ఫెయిల్ (హిందీ)

ఉత్తమ దర్శకుడు : సుదీప్తో సేన్ (ద కేరళ స్టోరీ (హిందీ))

ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : ఆశిష్ బెండే (ఆత్మపాంప్లెట్ - మరాఠీ)

ఉత్తమ విశేషాదరణ పొందిన వినోదభరిత చిత్రం : రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ (హిందీ)

ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం : శ్యామ్ బహదూర్ (హిందీ)

ఉత్తమ బాలల చిత్రం : నాల్ 2 (మరాఠీ)

ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్ మూవీ : హను-మ్యాన్ (తెలుగు)

ఉత్తమ నటుడు : షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (ట్వల్త్ ఫెయిల్)

ఉత్తమ నటి : రాణీ ముఖర్జీ (మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే)

ఉత్తమ సహాయనటుడు : విజయ రాఘవన్ (పూక్కాలమ్ - మళయాళం), సోమూ భాస్కర్ (పార్కింగ్ - తమిళం)

ఉత్తమ సహాయ నటి : ఊర్వశి (ఉల్లోళుక్కు - మళయాళం), జానకీ బోడీవాలా (వశ్ - గుజరాతీ)

ఉత్తమ బాలనటుడు/నటి : సుకృతి వేణి (గాంధీతాత చెట్టు - తెలుగు), కబీర్ కందరే (జిప్సీ - మరాఠీ), త్రిష, శ్రీనివాస్, భార్గవ్ (నాల్ 2- మరాఠీ)

ఉత్తమ గాయకుడు : పీవీయన్ యస్ రోహిత్ (ప్రేమిస్తా... (బేబీ- తెలుగు)

ఉత్తమ గాయని : శిల్పా రావ్ (చెలియా... జవాన్ -హిందీ)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : ప్రశాంతు మోహపాత్ర (ద కేరళ స్టోరీ - హిందీ)

ఉత్తమ స్క్రీన్ ప్లే : సాయి రాజేశ్ నీలమ్ (బేబీ - తెలుగు), రామ్ కుమార్ బాలకృష్ణన్ (పార్కింగ్ - తమిళం)

ఉత్తమ డైలాగ్ రైటర్ : దీపక్ కింగ్రాణీ (సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై - హిందీ)

ఉత్తమ ఎడిటింగ్ : మిథున్ మురళి (పూక్కాలమ్ - మళయాళం)

ఉత్తమ సౌండ్ డిజైన్ : సచిన్ సుధాకరన్, హరిహరన్ మురళీధరన్ (అనిమల్ - హిందీ)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : మోహన్ దాస్ (2018- ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో- మళయాళం)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ : సచిన్ లోవలేకర్, దివ్యా గంభీర్, నిధి గంబీర్ (శ్యామ్ బహదూర్ - హిందీ)

ఉత్తమ మేకప్ : శ్రీకాంత్ దేశాయ్ (శ్యామ్ బహదూర్ - హిందీ)

ఉత్తమ సంగీత దర్శకత్వం : జీవీ ప్రకాశ్ కుమార్ (వాతి - తమిళం)

ఉత్తమ నేపథ్య సంగీతం : హర్ష వర్ధన్ రామేశ్వర్ (అనిమల్ - హిందీ)

ఉత్తమ గీత రచయిత : కాసర్ల శ్యామ్ (ఊరూ పల్లెటూరు... బలగం - తెలుగు)

ఉత్తమ కొరియోగ్రఫి : వైభవీ మర్చంట్ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ లోని 'ధింధోరా బాజే...' పాటకు)

ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫి) : నందు పృథ్వీ (హను-మ్యాన్ - తెలుగు)

ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు...

ఉత్తమ తెలుగు సినిమా - భగవంత్ కేసరి

ఉత్తమ తమిళ సినిమా - పార్కింగ్

ఉత్తమ పంజాబ్ సినిమా - గాడ్డే గాడ్డే చా

ఉత్తమ ఒరియా సినిమా - పుష్కర

ఉత్తమ మరాఠీ సినిమా - శ్యామ్చీ ఆయీ

ఉత్తమ మళయాళం - ఉల్లోళుక్కు

ఉత్తమ కన్నడ - కందీలు - ద రే ఆఫ్ హోప్

ఉత్తమ హిందీ సినిమా - కఠల్ - ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ

ఉత్తమ గుజరాతీ - వశ్

ఉత్తమ బెంగాలీ - డీప్ ఫ్రిజ్

ఉత్తమ అస్సామీ - రొంగటపు 1982

ప్రత్యేక విభాగం...

ఉత్తమ గరో ఫిలిమ్ - రిమ్ డోగిట్టానా

ఉత్తమ తై ఫకే ఫిలిమ్ - పై తంగ్ (స్టెఫ్ ఆఫ్ హోప్)

ప్రత్యేక ప్రశంస - ఎమ్.ఆర్.రాజ్ క్రిష్ణన్ (రీ-రికార్డింగ్ మిక్సర్ - అనిమల్ - హిందీ)

Updated Date - Aug 01 , 2025 | 09:22 PM