43 New Actors: 43 మంది కొత్తవారితో కల్ట్ కమర్షియల్
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:59 AM
‘ఏ స్టార్ ఈజ్ బార్న్’ చిత్రం టైటిల్‌ను ‘మ్యానిప్యూలేటర్’గా మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు దర్శకుడు వీజే సాగర్. కల్యాణ్, ప్రియా పాల్, సోఫియా ఖాన్. ఊహా రెడ్డి తదితరులు...
‘ఏ స్టార్ ఈజ్ బార్న్’ చిత్రం టైటిల్‌ను ‘మ్యానిప్యూలేటర్’గా మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు దర్శకుడు వీజే సాగర్. కల్యాణ్, ప్రియా పాల్, సోఫియా ఖాన్. ఊహా రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ఆవిష్కరించారు. సినిమా విజయం సాధించాలంటూ ఆయన యూనిట్ సభ్యులకు ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సాగర్ మాట్లాడుతూ ‘ఈ సినిమాతో 43 మంది కొత్త నటీనటుల్ని పరిచయం చేస్తున్నాం. నేటి యువతను దృష్టిలో పెట్టుకుని తీసిన కల్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది’ అని చెప్పారు. రవిసాగర్, వీజే సాగర్ ఈ చిత్రానికి నిర్మాణసారఽధులు.