మధ్యతరగతి కుటుంబాల కథ

ABN , Publish Date - Jun 30 , 2025 | 02:32 AM

సిద్ధార్థ్‌, శరత్‌కుమార్‌, దేవయాని ప్రధాన పాత్రల్లో శ్రీ గణేశ్‌ తెరకెక్కించిన చిత్రం ‘3బీహెచ్‌కే’. శాంతి టాకీస్‌ బేనర్‌పై అరుణ్‌ విశ్వ నిర్మించారు. జూలై 4న ప్రేక్షకుల ముందుకు...

సిద్ధార్థ్‌, శరత్‌కుమార్‌, దేవయాని ప్రధాన పాత్రల్లో శ్రీ గణేశ్‌ తెరకెక్కించిన చిత్రం ‘3బీహెచ్‌కే’. శాంతి టాకీస్‌ బేనర్‌పై అరుణ్‌ విశ్వ నిర్మించారు. జూలై 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సిద్ధార్థ్‌ మాట్లాడుతూ ‘ తండ్రీకొడుకుల అనుబంఽధాన్ని బొమ్మరిల్లు సినిమాలో చూశారు. అలాంటి అనుబంధాన్నే ఇప్పుడు ‘3బీహెచ్‌కే’ చిత్రంలో చూస్తారు’ అని అన్నారు. నటుడు శరత్‌కుమార్‌ మాట్లాడుతూ ‘మనమందరం మధ్యతరగతి కుటుంబాల నుంచే వచ్చాం. ఇల్లు కట్టుకోవాలనే కల అందరికీ ఉంటుంది. ఇల్లు అనేది ఒక గౌరవం. కుటుంబ సభ్యులంతా ఒకేచోట కూర్చొని చూడదగిన చిత్రమిది’ అని అన్నారు. చిత్రదర్శకుడు శ్రీ గణేశ్‌ మాట్లాడుతూ ‘మా సినిమా అందరికీ కనెక్ట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. చాలా ప్రేమతో ఈ సినిమా తీశాం. ఆదరించాలని ప్రేక్షకులను కోరుతున్నా’ అని అన్నారు. చిత్ర నిర్మాత అరుణ్‌ విశ్వ మాట్లాడుతూ ‘ఈ చిత్రం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని అన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 02:32 AM